పవన్ సినిమా నుంచి నిధి అగర్వాల్ తప్పుకుందా.. అసలు నిజం ఏంటి?

Clarity On Nidhhi Agerwal Exit From Harihara Veeramallu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం పవన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.

 Clarity On Nidhhi Agerwal Exit From Harihara Veeramallu-TeluguStop.com

విరామం తరువాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ స్పీడ్ గా దూసుకుపోతున్నారు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు.

పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రాజెక్టులలో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న హరిహర వీరమల్లు సినిమా కూడా ఒకటి.అయితే ఈ సినిమా ఎప్పుడో పూర్తి కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఈ షూటింగ్ పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది.

 Clarity On Nidhhi Agerwal Exit From Harihara Veeramallu-పవన్ సినిమా నుంచి నిధి అగర్వాల్ తప్పుకుందా.. అసలు నిజం ఏంటి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అతి త్వరలోనే ఈ సినిమాను ప్రారంభించాలని ఈ సినిమా యూనిట్ ఆలోచిస్తోంది.అందుకోసం హైదరాబాదులో భారీ సెట్ ను కూడా నిర్మించారు.

వచ్చే నెల నుంచిసినిమా షూటింగ్ మొదలు కానుందని తెలుస్తోంది.ఈ సినిమాలో నిధి అగర్వాల్ కీలక పాత్ర పోషిస్తుందని చిత్రయూనిట్ కన్ఫామ్ చేసిన సంగతి తెలిసిందే.

ఇటీవలే హరిహర వీరమల్లు సినిమాలోని నిధి అగర్వాల్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు చిత్ర బృందం.ఇది ఇలా ఉంటే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ రోజురోజుకు ఆలస్యం అవుతుండటంతో ఈ సినిమా నుంచి నిధి అగర్వాల్ తప్పుకుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.

Telugu Hariharaveera, Nidhi Agerwal, Pawan Kalyan, Tollywood-Movie

ఇక తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా నుంచి నిధి అగర్వాల్ తప్పుకోలేదని చిత్ర యూనిట్ వెల్లడించింది.అంతేకాకుండా ఆమె పాత్రకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తయింది అని తెలిపింది.దీనితో సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలకు పుల్ స్టాప్ పడిపోయింది.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వజ్రాల దొంగలా నటిస్తున్నారు.దీని కోసం పవన్ కళ్యాణ్ గుర్రపుస్వారీ, కత్తి సాము, కర్రసాము తో సహా పలు విద్యలు నేర్చుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఈ సినిమాకు డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కబోతుంది.

#HariharaVeera #Nidhi Agerwal #Pawan Kalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube