అక్టోబర్ 7న సమంత, చైతూ ఇష్యుపై క్లారిటీ?

గత రెండు నెలల నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏదైనా ఆసక్తికరమైన విషయం ఉందా.అంటే అది అక్కినేని నాగచైతన్య సమంత విడాకులు విషయం అని చెప్పవచ్చు.

 Clarity On Naga Chaitanya Samantha Relationship Is Expected To Come On October 7-TeluguStop.com

గత రెండు నెలల నుంచి సోషల్ మీడియా వేదికగా సమంత నాగచైతన్య విడిపోతున్నారని, త్వరలోనే వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.అయితే వీరి గురించి ఈ విధమైనటువంటి వార్తలు వస్తున్నప్పటికీ వీరెవరు ఈ వార్తలపై స్పందించకపోవడం గమనార్హం.

అయితే గత రెండు నెలల నుంచి సమంత నాగచైతన్య తో కలిసి ఉండటం లేదని.తన స్నేహితులతో కలిసి చెన్నై గోవా ట్రిపుల్ వేస్తూ ఒంటరిగా ఎంజాయ్ చేస్తోంది.

సమంత ఇలా తన స్నేహితులతో కలిసి చెన్నైలో గడపడం చేత నాగచైతన్య కూడా నాగార్జున ఇంటికి షిఫ్ట్ అయినట్లు తెలుస్తుంది.ఇక ఈ విడాకుల విషయం గురించి నాగచైతన్య కూడా స్పందించకపోవడంతో అభిమానులు తీవ్ర సందిగ్ధంలో పడిపోయారు.

నాగచైతన్య నటించినటువంటి లవ్ స్టోరీ సినిమా ప్రమోషన్ లో సమంత ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం.నాగచైతన్య కి దూరంగా ఉంటున్న సమంత తన మామ నాగార్జున సోషల్ మీడియా వేదికగా ఈ పోస్ట్ పెట్టిన వెంటనే రెస్పాండ్ అవుతున్నారు.

Telugu Divorce, Naga Chaitanya, Samantha, Tollywood-Movie

నాగార్జున పుట్టినరోజు సందర్భంగా తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన సమంత అలాగే నాగేశ్వరరావు జయంతి సందర్భంగా నాగార్జున చేసిన ట్వీట్ కి రిప్లై ఇస్తూ చాలా బాగుంది నాగార్జున మామ అంటూ రీ ట్వీట్ చేశారు.నాగచైతన్య విషయంలో స్పందించని సమంత నాగార్జున విషయంలో స్పందించడంతో అభిమానులు చైతు – సమంతల మధ్య ఏం జరుగుతుందో తెలియక, తీవ్ర ఆందోళన చెందుతున్నారు.అయితే అక్టోబర్ 7వ తేదీ సమంత నాగచైతన్య పెళ్లి రోజు కావడంతో వీరిద్దరి మధ్య ఏ విధమైన సమస్యలు ఉన్న ఆరోజు వాటి గురించి క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని అభిమానులు భావిస్తున్నారు.చూడాలి వీరి పెళ్లి రోజు అయిన ఈ విషయంపై స్పష్టత ఇస్తారో లేక అభిమానులను ఇలాంటి సందిగ్ధంలోనే ఉంచుతారో తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube