హుజురాబాద్ ఉప ఎన్నికపై క్లారిటీ.. ఎప్పుడంటే?

అధికార టీఆర్​ఎస్​, బీజేపీ, కాంగ్రెస్​ నేతలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హుజురాబాద్​ ఉప ఎన్నికకు సమయం ఆసన్నమైంది.

హుజురాబాద్​ ఉప ఎన్నిక కోసం ఇప్పటికే అధికార టీఆర్​ఎస్​ బీజేపీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి.

ఈ నెల 15 తర్వాత హుజురాబాద్​ ఉప ఎన్నికకు నోటిఫికేషన్​ వచ్చే అవకాశం ఉన్నట్లు టీఆర్​ఎస్​ వారికి సమాచారం అందినట్లు తెలుస్తోంది.అంతే కాకుండా ఆగస్టులో ఈ ఉప ఎన్నికను నిర్వహించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

హుజురాబాద్​ నియోజకవర్గంతో పాటు దేశంలో ఖాళీగా ఉన్న సుమారు 50 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం యోచిస్తోంది.ఇప్పటికే హుజురాబాద్​ ఉప ఎన్నిక కోసం వెలువడాల్సిన నోటిఫికేషన్​ కరోనా కారణంగా ఆలస్యమైనట్లు తెలుస్తోంది.

ఇక హుజురాబాద్​ పోటీకి సమయం దగ్గర పడుతుండటంతో పార్టీలన్నీ అలర్ట్​ అయ్యాయి.మొన్నటి వరకు పోటీలో లేని కాంగ్రెస్​ కూడా ప్రస్తుతం రేవంత్​ రెడ్డికి టీపీసీసీ అప్పగించడంతో లైమ్ లైట్​ లోకి వచ్చింది.

Advertisement

త్వరలో బీజేపీ నేత బండి సంజయ్​ పాదయాత్ర కూడా చేస్తానని ప్రకటించడంతో హుజురాబాద్​ రాజకీయాలు వేడెక్కాయి.ఇన్నాళ్లు నైరాశ్యంలో ఉన్న కాంగ్రెస్​ క్యాడర్​ కూడా రేవంత్​ రెడ్డికి పీసీసీ పగ్గాలు అప్పజెప్పడంతో ఎక్కడ లేని ఉత్సాహంతో పోటీకి సిద్ధమవుతోంది.

కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్​, టీఆర్​ఎస్​ ల అభ్యర్థులను ప్రకటించకపోవడం గమనార్హం.

కాగా ప్రస్తుతం జరుగుతున్న జలజగడాలతో ఏమైనా నష్టం వాటిల్లుతుందా.అని అధికార టీఆర్​ఎస్​ నేతలు యోచిస్తున్నట్లు సమాచారం.ప్రజల్లో తెలంగాణ సెంటిమెంట్​ ను రగిల్చి దాన్ని ఓట్ల రూపంలో క్యాష్ చేసుకోవాలని టీఆర్​ఎస్​ చూస్తోందట.

నిన్న మొన్నటి వరకు అక్టోబర్​ లోనే హుజురాబాద్​ స్థానానికి ఉప ఎన్నికలు వస్తాయని భావించిన పార్టీలు ప్రస్తుతం ఆగస్టులోనే ఈ ఎన్నికలు జరుగుతాయని నమ్ముతున్నారు.ఎన్నికల్లో.

చిరంజీవికి నాగబాబు కంటే పవన్ పైనే ప్రేమ ఎక్కువట.. అందుకు కారణాలివే!
Advertisement

తాజా వార్తలు