ఆచార్యలో చరణ్ పాత్ర నిడివి పై క్లారిటీ ఇచ్చిన చిత్రబృందం!

Clarity On Charans Character Length In Acharya Movie

మెగాస్టార్ రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాల్లో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య చిత్రంలో నటించారు.

 Clarity On Charans Character Length In Acharya Movie-TeluguStop.com

ఇందులో మెగాహీరోతో పాటు తన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సిద్దు అనే పాత్రలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.ఇందులో రామ్ చరణ్ పాత్ర అత్యంత కీలకంగా ఉండబోతోందని తాజాగా విడుదలైన టీజర్ చూస్తేనే అర్థమవుతుంది.

ఇకపోతే ఈ సినిమాలో చరణ్ పాత్ర నిడివి ఎంత సేపు ఉంటుందన్న విషయం గురించి పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి.కేవలం కొంత సమయం పాటు మాత్రమే రామ్ చరణ్ ఇందులో కనిపించబోతున్నారని, అరగంటకు పైగా రామ్ చరణ్ సందడి చేయబోతున్నారు అని పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.

 Clarity On Charans Character Length In Acharya Movie-ఆచార్యలో చరణ్ పాత్ర నిడివి పై క్లారిటీ ఇచ్చిన చిత్రబృందం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే తాజాగా చిత్రబృందం ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర నిడివి ఎంత అనే విషయం గురించి క్లారిటీ ఇచ్చారు.

Telugu Acharya, Ram Charan, Tollywood-Movie

ఈ క్రమంలోనే రామ్ చరణ్ ఆచార్య సినిమాలో 40 నిమిషాల పాటు కనిపించనున్నారు.ఈ నలభై నిమిషాలు సినిమాకి ఆద్యంతం కీలకంగా మారనుంది.ఇలా ఒకే తెరపై తండ్రీ కొడుకులు ఎక్కువ నిడివి ఉన్న సినిమాలలో కనిపించడం ఇదే మొదటిసారి.

ఇకపోతే ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ నటించగా రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది.ఈ సినిమా ఫిబ్రవరి 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

#Ram Charan #Acharya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube