విజయ్‌ దేవరకొండపై వస్తున్న రెండు ఆసక్తికర వార్తలపై క్లారిటీ

‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రం నిరాశ పర్చడంతో విజయ్‌ దేవరకొండ ఈసారి తన అభిమానులకు ఖచ్చితంగా సక్సెస్‌ను కానుకగా ఇవ్వాలని కోరుకుంటున్నాడు.అందుకోసం ఇప్పటికే క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో చేస్తున్న సినిమాపై మరింత శ్రద్ద పెడుతున్నాడు.

 Clarity Givenon Vijay Devarakonda Movies Kranthi-TeluguStop.com

మరో వైపు ఈయన పూరి దర్శకత్వంలో ఒక చిత్రంను కూడా చేయబోతున్నాడు.ఆ చిత్రంకు సంబంధించిన విషయాలపై పలు రకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ముఖ్యంగా ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండ ఒక ఫైటర్‌గా కనిపిస్తాడంటూ చర్చ జరుగుతుంది.దీంతో పాటు బాలీవుడ్‌లో ఈయన సినిమా గురించి వార్తలు వస్తున్నాయి.

Telugu Dear Comrade, Kranthi Madavu, Purijagandh-

  ఈ రెండు విషయాలు విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌ను ఎంతో మదన పెడుతున్నాయి.ఈ రెండు విషయాల గురించి రౌడీ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు.ఇలాంటి సమయంలో ఆ రెండు విషయాల గురించిన క్లారిటీ ఇప్పుడు నేను మీ ముందుకు తీసుకు వచ్చాను.మొదటగా ఫైటర్‌ చిత్రం గురించి వస్తున్న వార్తల విషయానికి వస్తే అందులో ఏమాత్రం నిజం లేదు.

ఇందులో విజయ్‌ ఫైటర్‌గా కనిపించబోవడం లేదు.ఒక మాఫియా డాన్‌ కొడుకు పాత్రలో విజయ్‌ దేవరకొండ కనిపించబోతున్నాడు.

తన తండ్రి మాఫియాను లీడ్‌ చేసే క్రమంలో అతడు ఏ స్థాయిలో ఫైట్‌ చేశాడనేది పూరి చూపించబోతున్న చిత్రంగా తెలుస్తోంది.

ఇక విజయ్‌ దేవరకొండ బాలీవుడ్‌ చిత్రం నూటికి నూరు శాతం నిజం కాదు.

ఇటీవలే విజయ్‌ దేవరకొండ ఆ విషయంపై స్వయంగా క్లారిటీ ఇచ్చాడు.తనకు బాలీవుడ్‌ వెళ్లాలనే ఆసక్తి లేదని, అసలు బాలీవుడ్‌ సినిమా గురించి ఎలాంటి చర్చలు కూడా జరగడం లేదని అన్నాడు.

గతంలో కరణ్‌ జోహార్‌ ఒక మాట అన్నది పట్టుకుని ఇప్పుడు నెటిజన్స్‌ కొందరు ఆ విషయాన్ని రచ్చ చేస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.మొత్తానికి విజయ్‌ దేవరకొండ పై వస్తున్న ఆ రెండు పుకార్లు నిజం కాదని తేలిపోయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube