క్లారిటీ ఇచ్చిన ధోని.. అక్కడికి వెళ్ళేది లేదు..!

మహేంద్ర సింగ్ ధోని.ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరేమో.28 ఏళ్ళ భారతీయుల కలను నెరవేర్చి భారత క్రికెట్ జట్టును అగ్రస్థానంలో నిలిపాడు.వరల్డ్ కప్ లో ధోని కొట్టిన సిక్స్ గురించి ఇప్పటికే మాట్లాడుకుంటున్నారు అంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.

 Clarity Given By Dhoni .. Did Not Go There ..! Ms Dhoni, Clarity , Latest News,-TeluguStop.com

ఎంత వత్తిడిలో ఉన్న కూల్ గా ఉండడం ధోని స్పెషల్.అందుకే అందరు కూల్ కెప్టెన్ ధోని అంటారు.ధోని ఇప్పుడు ఐపిఎల్ ఆడుతున్నాడు.గతేడాది నిరాశ పరచిన చెన్నై ఈసారి అందరికంటే ముందు ప్లే ఆఫ్ బెర్తును చేసుకుంది.

ధోని గత ఏడాది ఆగస్టు 15వతేదీన అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే.ఇప్పడు ఐపిఎల్ ఆడుతున్న ధోని మరో కొన్ని విషయంపై క్లారిటీ ఇచ్చారు.

సాదరంగా చాలా మంది మంది రిటైర్మెంట్ తరువాత వేరే ఫీల్డ్స్ లో వెళ్తుంటారు.ఇలానే ధోని కూడా క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించాక బాలీవుడ్ లోకి వెళ్తారు అనే వార్తలు ఇది వరకు చక్కర్లు కొట్టాయి.

కొందరు క్రికెటర్లు అలా వెళ్లిన వారు కూడా ఉన్నారు.తాజగా క్రికెటర్ హర్భజన్ సింగ్ ఫ్రెండ్‌షిప్ అనే తమిళ చిత్రంలో నటించారు.ఇదివరకు మరికొంత మంది కూడా గతంలో నటించారు.ధోని కూడా క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాక బాలీవుడ్ కి వెళ్తాయని వార్తలు వచ్చాయి.

అయితే ధోని ఈ వార్తలకు చెక్ పెట్టి అందరికి క్లారిటీ ఇచ్చాడు.

Telugu Cini, Latest, Msdhoni, Ups-Latest News - Telugu

రిటైర్మెంట్ తర్వాత తాను బాలీవుడ్‌ లోకి వెళ్లనని ధోనీ స్పష్టం చేశారు.నటన తేలికైన పని కాదని, అందుకే తాను క్రికెట్ కు కట్టుబడి ఉంటానని అన్నారు.సినిమాల్లో నటించడం అంటే టీ కప్పు లాంటిది కాదని, చాలా కఠినమైన వృత్తి అని ధోని చెప్పారు.

ఇప్పుడు నటులు ఉన్నారు వారిని నటించనివ్వండి అన్నారు.ఇప్పడూ ప్రకటనలు చేస్తున్నానని, వాటితో సంతోషంగా ఉన్నానని అన్నారు.

ధోని గురించి బయోపిక్ వచ్చిన విషయం అందరికి తెలిసిందే.ఆ బయోపిక్ లో దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube