ఆది సినిమాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చిన చిరు.. ఏకంగా టీజర్ నే?

తెలుగు సినీ నటుడు ఆది పినిశెట్టి పరిచయం గురించి అందరికీ తెలిసిందే.తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆది.2006లో వి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.ఆ తర్వాత ఏడాది తమిళ ఇండస్ట్రీలో అడుగు పెట్టి వరుస సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

 Clap Teaser Released By Chiranjeevi Starring Aadi Pinishetty, Aadhi , Chiranjeev-TeluguStop.com

పలు సినిమాలలో నెగటివ్ పాత్రలో, సహాయ పాత్రలలో కూడా మెప్పించాడు ఆది.ఇదిలా ఉంటే తాను నటిస్తున్న మరో సినిమాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి.

ప్రస్తుతం ఆది.పృథ్వి ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతున్న ‘క్లాప్‘ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.ఇక ఈ సినిమాను బిగ్ ప్రింటర్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తుంది.ఈ సినిమాకు సంగీతాన్ని ఇళయరాజా అందిస్తున్నాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తికాగా త్వరలోనే విడుదల కానుంది.క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది.

మెగాస్టార్ చిరంజీవి ఆది సినిమాకు పుల్ సపోర్టు ఇస్తూ ఈ టీజర్ ని విడుదల చేశాడు.ఇందులో ఆది.తను ఆడే ఆటపై శ్రద్ధ పెట్టి ఎలాగైనా గెలవాలన్న తపనతో కనిపిస్తున్నాడు.ఈ సినిమాలో ఆది పాత్ర పేరు విష్ణు.

Telugu Aadhi, Aadipinishetty, Akanksha Singh, Brahmaji, Chiranjeevi, Clap Teaser

ఇందులో బ్రహ్మాజీ, ప్రకాష్ రాజ్ కూడా నటించారు.ఇందులో ఆది సరసన ఆకాంక్ష సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ భాషల్లో కూడా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు సినీ బృందం.ఈ టీజర్ లో ఆది అథ్లేట్ గా కనిపించగా బ్రహ్మాజీ, ప్రకాష్ రాజ్ వేసిన డైలాగ్స్ బాగా ఆసక్తిగా అనిపించాయి.

ఈ సినిమాలో విష్ణు తన ఆటలో అనుకున్న లక్ష్యానికి చేరుకోవడానికి తను పడే శ్రమ గురించి ఉండగా.ఈ సినిమా త్వరలోనే విడుదల కానుందని తెలుస్తుంది.ఈ సినిమాతో ఆది ఎటువంటి గుర్తింపు అందుకుంటాడో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube