సూర్య గ్రహణం రోజు వింత పోకడ... అంగవైకల్యం పోతుందని

భారతీయ హిందూ మతాలలో గూడు కట్టుకున్న మతవిశ్వాసాలు ఇప్పటికి కూడా కొన్ని చోట్ల ప్రతిబింబిస్తూ ఉంటాయి.స్థానికంగా ఉండే ప్రజలు అక్కడ ఉండే స్వామీజీలను, పూజారులను, కొండ దొరలని, పూర్వ కాలం నుండి వస్తున్న ఆచారాలను ఫాలో అవుతూ ఉంటారు.

 Claims Disabled Kids Buried During Eclipse-TeluguStop.com

ఇలాంటివి కొన్ని సందర్భాల్లో చూసేవారికి వింతగా, పిచ్చితనంగా కూడా ఉంటుంది.అయితే ఇలాంటి ఆచారాల వల్ల ఎలాంటి ఫలితం ఉండదని తెలిసినా కూడా ప్రజలు మాత్రం ఏదో చిన్న ఆశ కొద్ది వాటిని నమ్ముతూ ఉంటారు.

తాజాగా అలాంటి సంఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది.సూర్య గ్రహణం రోజు అంగవైకల్యం ఉన్న పిల్లల్ని మట్టిలో మొండెం వరకు పాతిపెడితే వారి అంగవైకల్యం పోతుందని భావించి అలానే చేశారు.

ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఇప్పుడు ఈ సంఘటనపై చాలా స్పందిస్తున్నారు.

కర్ణాటకలోని విజయ్‌పూర్ జిల్లా అర్జునగి పీకే గ్రామంలో సూర్యగ్రహణం రోజున పిల్లలను పాతిపెడితే అంగవైకల్యం పోతుందని అక్కడి ప్రజల నమ్మకం.

దీంతో తల్లిదండ్రులు తమ పిల్లల్ని మెడ వరకు నేలలో పాతిపెట్టారు.గ్రహణం మొదలయిన సమయం నుంచి విడిచే వరకూ ఆ పిల్లలు భూమిలోనే ఉండిపోయారు.అయితే ఇలాంటి ఘటనలు వల్ల అంగవైకల్యం పోతుందని భావిస్తే అది కాస్తా ప్రమాదకరంగా మారి ప్రాణాలు పోయే అవకాశాలు ఉన్నాయని జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు అంటున్నారు.ఇలాంటి మూర్ఖమైన పాల్పడవద్దని సూచిస్తున్నారు.

సూర్య గ్రహణం అనేది ఏదో యాదృచ్చికంగా వచ్చేది తప్ప దానికి ఎలాంటి పవర్స్ లేవని చెబుతున్నారు.ఇప్పటికైనా ప్రజలు మూఢనమ్మకాలు వదిలి వాస్తవంలోకి రావాలని సూచిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube