రేపు యాదాద్రికి సిజేఐ జస్టిస్ ఎన్వీ రమణ..!

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ రేపు యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని దర్శించనున్నారు.శుక్రవారం తిరుమల స్వామి వారి దర్శనం చేసుకున్న జస్టిస్ రమణ నేడు హైదరాబాద్ చేరుకుని రాజ్ భవన్ అతిథి గృహంలో బస చేశారు.

 Cji Nv Ramana Visit Yadadri Temple Tomorrow-TeluguStop.com

సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ గా నియమితులయ్యాక ఎన్వీ రమణ మొదటిసారి తెలంగాణాకు వచ్చారు.అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ సందర్భంగా ఘనంగా స్వాగతం పలికింది.

సీఎం కే.సి.ఆర్ స్వయంగా రాజ్ భవన్ కు వెళ్లి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు స్వాగతం పలికారు.

 Cji Nv Ramana Visit Yadadri Temple Tomorrow-రేపు యాదాద్రికి సిజేఐ జస్టిస్ ఎన్వీ రమణ..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

జస్టిస్ ఎన్వీ రమణ రేపు యాదాద్రి క్షేత్రాన్ని దర్శించనున్నారు.

రేపటి పర్యటనలో కూడా సీఎం క్.సి.ఆర్ సీజేఐ ఎన్వీ రమణ వెంట ఉంటారని తెలుస్తుంది.యాదాద్రి పర్యటనకు తెలంగాణా గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కూడా వెల్లనున్నారని సమాచారం.

జస్టిస్ ఎన్వీ రమణ పర్యాటన సందర్భంగా యాదాద్రిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది.యదాద్రి లక్ష్మి నరసింహాస్వామిని కుటుంబం సమేతంగా దర్శించుకోనున్న జస్టిస్ రమణ మొక్కులు చెల్లించుకుంటారని తెలుస్తుంది.

సీజేఐ రాక సందర్భంగా హైదరాబాద్ లో కాంగ్రెస్ నేతలు మర్యాపూర్వకంగ కలిశారు.టీపీసీసీ చీఫ్ ఉత్తం కుమార్ రెడ్డి, సీనియర్ నేత వి.హనుమంతరావు, కావూరి సాంబశివరావు చీఫ్ జస్టిస్ ను కలిశారు.

#Yadadri Temple #Tomorrow #Visit #Nv Ramana #Telangana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు