నా గర్ల్ ఫ్రెండ్ తో నాకు ఉద్వేగభరిత క్షణం! సివిల్స్ టాపర్ సంచలన సంచలన వాఖ్యలు  

తన సక్సెస్ కి తన గర్ల్ ఫ్రెండ్ కారణం అన్న సివిల్స్ టాపర్. .

Civil Topper Kanishk Kataria Gives His Success Credit To Girl Friend-

తాజా శుక్రవారం సాయంత్రం దేశ వ్యాప్తంగా సివిల్స్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాలలో దేశ వ్యాప్తంగా అన్ని చాలా రాష్ట్రాల నుంచి యువత సత్తా చాటి సివిల్ సర్విస్ కి సిద్ధం అయ్యారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో సివిల్స్ లో ఈ సారి సత్తా చాటారు..

నా గర్ల్ ఫ్రెండ్ తో నాకు ఉద్వేగభరిత క్షణం! సివిల్స్ టాపర్ సంచలన సంచలన వాఖ్యలు-Civil Topper Kanishk Kataria Gives His Success Credit To Girl Friend

ఇక రాజస్థాన్ కి చెందిన కనిష్క్ కటారియా సివిల్స్ లో ఫస్ట్ ర్యాంకు సొంతం చేసుకొని తన సామర్ధ్యం నిరూపించుకున్నాడు. ఇంజనీరింగ్ నేపధ్యం నుంచి వచ్చి కొంత కాలం సాఫ్ట్ వేర్ లో ఉద్యోగం చేసిన కనిష్క్ కటారియా తరువాత యూపీఎస్సీ వైపు ద్రుష్టి పెట్టాడు. ఇక ఈ పరీక్షలలో సత్తా చాటడం ద్వారా, అలాగే సివిల్స్ మెయిన్స్ కూడా మెరిసి టాపర్ గా నిలిచాడు.

ఈ సందర్భంగా మీడియా అతనిని ఇంటర్వ్యూ చేయడగా ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. సివిల్స్ సాధించడం వెనుక ఎవరైనా తమ తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉందని చెబుతూ ఉంటారు. అయితే అందుకు విరుద్ధంగా కనిష్క్ మాత్రం మొదటి ప్రాధాన్యత తన గర్ల్ ఫ్రెండ్ కి ఇచ్చాడు.

తన గర్ల్ ఫ్రెండ్ ప్రోత్సాహం కారణంగానే తాను సివిల్స్ వైపు వచ్చానని, ఈ క్షణాలు నా గర్ల్ ఫ్రెండ్, కుటుంబ సభ్యులతో తనకి ఎంతో ఉద్వేగభరితంగా అనిపిస్తున్నాయని చెప్పుకొచ్చారు. మొత్తానికి సివిల్స్ సాధించిన తర్వాత మొదటి సారి ఓ వ్యక్తి ఇలా తన ప్రేయసి కూడా క్రెడిట్ ఇవ్వడం నిజంగా గొప్ప విషయం అని చెప్పాలి.