సైకిల్‌ లాంటి ఎలక్ట్రిక్‌ బైక్‌.. అందరికీ తెగ నచ్చుతోంది!

Civilized Model 1 New Electric Cycle Bike Now In Market. America, E-bike. New York Company, Civilized Cycles, Advanced Electric Bike, Four Lakh Rupees, Anti Theft Locking System, India Market, Corona

కరోనా నేపథ్యంలో చాలా మంది ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌పై మొగ్గు చూపుతున్నారు.అందులోనూ పెరుగుతోన్న పెట్రోల్‌ ధరలు.

 Civilized Model 1 New Electric Cycle Bike Now In Market. America, E-bike. New Yo-TeluguStop.com

ప్రస్తుతం భారత్‌లో సెంచరీ దాటేసింది.అందుకే చాలా మంది ఇక ఎలక్ట్రిక్‌ బాట పట్టాల్సిందేనని అనుకుంటున్నారు.

ఇప్పటికే కొన్ని కంపెనీలు ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ అందుబాటులోకి తెస్తూనే ఉన్నాయి.తాజాగా న్యూయార్క్‌కు చెందిన సివిలైజ్డ్‌ సైకిల్స్‌ ఓ అద్భుతమైన ఎలక్ట్రిక్‌ సైకిల్‌ బైక్‌ను లాండ్‌ చేసింది.

దీనికి ‘మోడల్‌ 1’ అని పేరు పెట్టింది.ఇది చూడటానికి అచ్చం సైకిల్‌లా కనిపిస్తుంది.

దీనిపై కంపెనీ మాట్లాడుతూ.ఈ సైకిల్‌పై ప్రయాణం చాలా సులభంగా ఉంటుందని చెబుతోంది.

ఈ సైకిల్‌కు బ్యాటరీ, హార్డ్‌ కేస్, హెడ్‌ అండ్‌ టెయిల్‌ లైట్స్‌ ఉన్నాయి.అంతేకాదు ఈ బైక్‌కి సెన్సార్, టచ్‌ కంట్రోల్‌ ఏర్పాటు చేసింది.పెడల్‌ పవర్‌తోపాటు 1.5 కిలోవాట్స్‌ మిడ్‌ డ్రైవ్‌ మోటర్‌ ఉంటుంది.గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయవచ్చు.దీనిలో ఉండే ఏబీ వెర్షన్‌ అప్‌గ్రేడ్‌లో ఉంది.ఒక్కసారి రీఛార్జి చేస్తే చాలు దాదాపు 80 కిలో మీటర్ల మేర ప్రయాణం చేయవచ్చు.సైకిల్‌ లా ఉంటుంది కదా! ధర తక్కువే ఉంటుందని అనుకోకండి.

దీని అసలు ధర 4,499 డాలర్లు.ఇది ఆఫర్‌ ప్రైజ్‌.

Telugu Theft System, Corona, Electric Bike, Rupees, India, York Company, Touch-G

మన రూపీలో అక్షరాల రూ.3,33,574.ఈ బైక్‌కు మరో అద్భుత ఫీచర్‌ కూడా ఉంది.హెడ్‌లైట్‌ ఆటోమెటిగ్గా కంట్రోల్‌ అవుతుంది.

అంటే ఏదైనా వెహికల్‌ ఎదురుగా వస్తే, అదే లైట్‌ పెంచుకుంటుంది.తగ్గించుకుంటుంది.ఈ బైక్‌ వెనుక వైపు సామాన్లు ఈజీగా మోసుకెళ్లే జాగ ఉంటుంది.

32 ఎంఎం ఫ్రంట్‌ ఫోర్స్‌ అండ్‌ డిస్క్‌ బ్రేకులు బైక్‌కు రెండు వైపులా ఉంటాయి.దొంగల భయం కూడా ఉండదు.ఎందుకంటే థెఫ్ట్‌ ట్రాకింగ్‌కు పిన్‌ కోడ్‌ లాక్‌ సిస్టం కూడా ఉంది.

Telugu Theft System, Corona, Electric Bike, Rupees, India, York Company, Touch-G

రానున్న రోజుల్లో దీని ధరను పెంచనున్నామని కంపెనీ తెలిపింది.అంటే దీంతో ఈ బైక్‌ ధర నాలుగు లక్షలు దాటేయొచ్చు.భారత్‌లో అయితే ఈ ధరకు కొన్ని కార్లు కూడా కొనవచ్చు అనుకుంటారు.మన మార్కెట్‌లో అంత ధర పెట్టి కేవలం ఎలక్ట్రిక్‌ బైక్‌ను కొనుక్కోరు కదా! ఇక కంపెనీ ఈ బైక్‌కు సంబంధించిన రెండు వీడియోలను అప్‌లోడ్‌ చేసింది.

సంబంధిత కంపెనీ వెబ్‌సైట్‌లో ఈ బైక్‌కు సంబంధించిన వీడియోలు అందుబాటులో ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube