దొంగా పోలీస్ ఆట...జనానికి ప్రాణసంకటం: ఛేజింగ్‌లపై విధివిధానాలు  

City Of Laredo Is Recognizing The Public’s Risk During Speed Chases-nri,public’s Risk,risk During Speed Chases,telugu Nri News Updates

అమెరికాలో నేరస్తులను పట్టుకోవడానికి అక్కడి పోలీసులు చేజింగ్‌లు చేస్తుంటారు.హాలీవుడ్ సినిమాలను తలపించే ఈ తరహా విన్యాసాల వల్ల సామాన్య పౌరులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.చేజింగ్ సమయాల్లో పోలీసులతో పాటు ప్రజలు సైతం తీవ్రంగా గాయపడిన, మరణించిన ఉదంతాలు కోకొల్లలు.

City Of Laredo Is Recognizing The Public’s Risk During Speed Chases-nri,public’s Risk,risk During Speed Chases,telugu Nri News Updates-City Of Laredo Is Recognizing The Public’s Risk During Speed Chases-Nri Public’s Risk Chases Telugu Nri News Updates

City Of Laredo Is Recognizing The Public’s Risk During Speed Chases-nri,public’s Risk,risk During Speed Chases,telugu Nri News Updates-City Of Laredo Is Recognizing The Public’s Risk During Speed Chases-Nri Public’s Risk Chases Telugu Nri News Updates

ఈ నేపథ్యంలో లారేడో నగరం ఈ సాహస విన్యాసాలపై దృష్టి సారించింది.డిస్ట్రిక్ట్ 5కు చెందిన నెల్లీ విల్మా అనే కౌన్సిల్ మెంబర్ తాను ఛేజింగ్‌ల వల్ల పడిన ఇబ్బందిని తెలిపారు.అంతేకాకుండా ఈ ఘటనల్లో గాయపడిన లేదా మరణించిన ఎంతోమంది బాధితులకు న్యాయ సహాయం అందించానని విల్మా వెల్లడించారు.

లారేడో పోలీస్ శాఖ అధిపతి ట్రావినో మాట్లాడుతూ.ఛేజింగ్ సమయాల్లో పోలీసులు పాటించాల్సిన విధివిధానాలపై పది పేజీల పాలసీ గైడ్‌ను రూపొందించామన్నారు.కారు నెంబర్ ప్లేట్ ఆధారంగా నేరస్తుల ఆచూకీని కనుగొని అరెస్ట్ చేసేందుకు తమకు అధికారం ఉందని ఆయన తెలిపారు.

పబ్లిక్ సేఫ్టీ అడ్వైజరీ కమిటీ తన రివ్యూ మీటింగ్‌లో ఈ విధానాలపై జాతీయ, రాష్ట్ర, స్థానిక న్యాయ మండళ్లకు దిశానిర్దేశం చేసిందన్నారు.రోడ్లపై వాహనాలు నడిపేటప్పుడు, నడిచేటప్పుడు ముందు వెనుక గమనించాలని విల్మా, ట్రావినో ప్రజలకు విజ్ఞప్తి చేశారు.