పెళ్లి విషయం బయటకు రాగానే ఎవరైనా అడిగే మొదటి ప్రశ్న వరకట్నం ఎంత? కట్నం లేకుండా ఎవరైనా పెళ్లి చేసుకున్నారు అంటే ఎవరూ కూడా నమ్మలేరు కుడా.అలాంటి సమాజం లో ఇవ్వబోతున్న కట్నాన్ని కూడా కాదనుకొని మరి పెళ్లి చేసుకున్న ఘటనలు చాలా అరుదుగా చోటుచేసుకుంటూ ఉంటాయి.సరిగ్గా అలాంటి ఘటనే జైపూర్ లో చోటుచేసుకుంది.ఒక సీఐఎస్ ఎఫ్ జవాన్ తనకు ఇస్తున్న కట్నాన్ని వద్దను కొని అందరికీ కూడా ఆదర్శంగా నిలిచాడు.
జైపూర్‌కు చెందిన జితేంద్ర సింగ్ సీఐఎస్ఎఫ్ జవానుగా పని చేస్తున్నాడు.జితేంద్ర సింగ్‌కు ఒక అమ్మాయితో ఈ నెల 8వ తేదీన వివాహం జరిగింది.అయితే పెళ్లి సమయంలో వధువు తల్లిదండ్రులు.కట్నం కింద వరుడికి రూ.11 లక్షలు ఇవ్వబోగా, వారిని వద్దని వారించి రూ.11 లక్షల బదులు కేవలం రూ.11 మాత్రమే తీసుకొని అందరికీ ఆదర్శంగా నిలిచాడు.అంతేకాకుండా నేను పెళ్లి చేసుకుంటున్న అమ్మాయి న్యాయవిద్య పూర్తి చేసింది.
ప్రస్తుతం పీహెచ్డీ చేస్తుంది.అంతేకాకుండా రాజస్థాన్ జ్యుడిషీయల్ సర్వీసెస్‌కు ప్రిపేర్ అవుతుంది.ఒక వేళ ఆమె జ్యుడిషీయల్ సర్వీసెస్‌లో ఉద్యోగం సంపాదిస్తే.అదే మాకు పెద్ద సంపాదన నాకు కట్నం అవసరమే లేదు అంటూ సున్నితంగా తిరస్కరించాడు.
ఆ జవాన్ మాటలతో వధువు తల్లిదండ్రులు ఆనంద భాష్పాలు రాల్చారు.

తొలుత కట్నం వద్దు అని అంటే ఎదో పెళ్లి ఏర్పాట్ల విషయంలో ఏదైనా లోపం కారణంగా వద్దు అంటున్నారేమో అని భావించామని,కానీ ఆ తరువాత వరుడి కుటుంబం వరకట్నం కు వ్యతిరేకమని తెలిసి చాలా సంతోషించినట్లు వధువు తల్లి దండ్రులు పేర్కొన్నారు.నిజంగా ఈ రోజుల్లో కూడా ఇలాంటి వారు ఉండడం చాలా అరుదుగా కనిపిస్తారు.మొత్తానికి ఈ జవాన్ తన నిర్ణయం తో అందరికీ ఆదర్శంగా నిలిచాడు.