అతని కారణంగా భర్తతో కలిసి సర్కస్ చేసిన దీపిక పదుకోనే?

బాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ డైరెక్టర్ రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన “సూర్య వంశీ” చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని సుమారు ఏడాది కావస్తున్నా ఇప్పటికీ ప్రేక్షకుల ముందుకు రాలేదు.ఈ క్రమంలోనే డైరెక్టర్ రోహిత్ శెట్టి మరొక సినిమాను కూడా ప్రకటించారు.

 Cirkus Update Deepika Is Going To Play Meenamma Character Again In Cirkus Movie,-TeluguStop.com

ఈ క్రమంలోనే దర్శకుడు  ‘ది కామెడీ ఆఫ్ ఎర్రర్స్‘ రీమేక్‌గా వస్తున్నటువంటి చిత్రానికి “సర్కస్” అనే టైటిల్ ఖరారు కాగా ఇందులో రణ్‌వీర్ సింగ్, వరుణ్ శర్మ, పూజా హెగ్డే, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ వంటి వారు కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో రణవీర్ సింగ్ నటించగా అతని భార్య దీపికా పదుకొనే అతిథి పాత్రలో కనిపిస్తున్నట్లు సమాచారం.

ఈ క్రమంలోనే 2013వ సంవత్సరంలో రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చెన్నై ఎక్స్ప్రెస్ సినిమాలో మీనమ్మ పాత్ర ద్వారా దీపికాపదుకునే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.ఈ సినిమా దీపికా కెరీర్లో ఒక మైలురాయని చెప్పవచ్చు.

Telugu Bollywood, Cirkus, Ranveer Singh-Movie

చెన్నై ఎక్స్ప్రెస్ ద్వారా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న దీపికాను ఈ సినిమాలో ఓ అతిథి పాత్రలో తీసుకువస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్లాన్ చేసారు దర్శకుడు రోహిత్ శెట్టి.ఇక రణవీర్ సింగ్, దీపిక ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.వీరిద్దరినీ ఇలా జంటగా కలిసి చూడటం కోసం ప్రేక్షకులు ఎంతో ఎదురు చూస్తున్నారని ఈ క్రమంలోనే దర్శకుడు ఈ విధమైనటువంటి ప్లాన్ చేసారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube