డిపో మేనేజర్‌ ఉద్యోగం ఊడేలా చేసిన రూ.10 కాయిన్‌ అతడికి తగిన గుణపాఠం అంటున్న ప్రయాణికులు  

Circular On Rs 10 Coins Tnstc Suspends Branch-

ఆర్బీఐ అధికారికంగా విడుదల చేసిన రూ.10 కాయిన్‌ను కొందరు తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు.చదువుకోని వారు తీసుకోవడం లేదంటే అవగాహణ లోపం అనుకోవచ్చు.కాని చదువుకున్న వారు ఉన్నత విద్యావంతులు కూడా కొందరు పది రూపాయల కాయిన్‌ను తీసుకునేందుకు నో చెబుతున్నారు.ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పది రూపాయల కాయిన్‌ వివాదం జరుగుతోంది.కొందరు పది రూపాయల కాయిన్స్‌ను తీసుకుంటూ ఉంటే మరి కొందరు వాటిని తీసుకోవడం లేదు.

Circular On Rs 10 Coins Tnstc Suspends Branch--Circular On Rs 10 Coins Tnstc Suspends Branch-

ఇటీవల తమిళనాడుకు చెందిన ప్రభుత్వ అధికారి 10 రూపాయల కాయిన్‌ తీసుకోవద్దంటూ సర్కిలర్‌ జారీ చేయడంతో అతడి ఉద్యోగం పోయింది.పూర్తి వివరాల్లోకి వెళ్తే… తమిళనాడు రాష్ట్రంలోని ఒక ప్రాంతంకు చెందిన బస్సు డిపో మేనేజర్‌ తమ కండక్టర్స్‌కు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.ఆ ఆదేశాల మేరకు రూ.10 రూపాయల కాయిన్స్‌ను కండక్టర్స్‌ తీసుకోవడం మానేశారు.దాంతో బస్సు ప్యాసింజర్స్‌ ఇబ్బంది పడ్డారు.తాజాగా ఒక కండక్టర్‌తో ప్రయాణికులు గొడవ పడటంతో అసలు విషయం ఆ కండక్టర్‌ను వెళ్లడించాడు.

Circular On Rs 10 Coins Tnstc Suspends Branch--Circular On Rs 10 Coins Tnstc Suspends Branch-

తమ డిపో మేనేజర్‌ తమకు ఆదేశాలు ఇచ్చాడని అందుకే ఇలా చేస్తున్నామని చెప్పడంతో ఉన్నతాధికారులు ఆయనపై చర్యలు తీసుకున్నారు.ఇలాంటి చెత్త ఆదేశాలు ఇచ్చినందుకు గాను ఆయన్ను ఉద్యోగం నుండి సస్పెండ్‌ చేస్తున్నట్లుగా వెంటనే ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

ఆర్బీఐ నుండి అధికారికంగా వెలువడిన 10 రూపాయల కాయిన్‌ను తీసుకోవద్దంటూ చెప్పడం ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయం అవుతుందని, అందుకే ఆయన్ను సస్పెండ్‌ చేసినట్లుగా ఉన్నతాధికారులు వెళ్లడించారు.

కండక్టర్‌ వద్ద వస్తున్న పది రూపాయల కాయిన్స్‌ను బ్యాంకు వారు తీసుకోని కారణంగా డిపోలో పెద్ద మొత్తంలో పది రూపాయల కాయిన్స్‌ పోగు అయ్యాయని, అందుకే వాటిని వదిలించుకునే వరకు ప్రయాణికుల నుండి పది కాయిన్స్‌ తీసుకోవద్దని తాను ఆదేశాలు జారీ చేసినట్లుగా ఆ అధికారి వివరణ ఇచ్చాడు.బ్యాంకులు కూడా తీసుకోవడం లేదంటూ ఆయన చెప్పడంపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.