చిన్నపిల్లలు మీరు.. మాకు చెప్తున్నారా అంటూ కోట గారు ఫైర్ అయ్యారు: కెమెరామెన్

Cinematographer P G Vinda Sensational Comments On Actor Kota Srinivasa Rao

2004లో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన ప్రముఖ ఛాయాగ్రాహకుడు, దర్శకుడు పి.జి.

 Cinematographer P G Vinda Sensational Comments On Actor Kota Srinivasa Rao-TeluguStop.com

వింద.అనుమానస్పదం, అష్టా-చెమ్మా, వినాయకుడు లాంటి సినిమాలకు ఛాయగ్రాహకుడిగా పనిచేసిన విందా, గ్రహణం సినిమాకు గానూ జాతీయఅవార్డును కూడా అందుకున్నారు.

నేషనల్ డైరెక్టర్ నీలకంఠ గారితో కలిసి పనిచేస్తున్నపుడు ఎవరితో అయితే యాక్టింగ్ చేపిస్తున్నామో వాళ్లు కదిలే మూమెంట్స్‌లో మార్కింగ్‌ను ఫిక్స్ చేసేవారమని సినిమాటోగ్రాఫర్ పి.జి.విందా తెలిపారు.అలా చేస్తున్నపుడు ఒక మూవీ షూటింగ్‌లో భాగంగా ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావుతో కలిసి చేస్తున్నపుడు తనకు షాట్ వివరించి, అందరి నటులకు లాగేనే ఆయనకూ మార్కింగ్‌ను గీశామని ఆయన అన్నారు.

 Cinematographer P G Vinda Sensational Comments On Actor Kota Srinivasa Rao-చిన్నపిల్లలు మీరు.. మాకు చెప్తున్నారా అంటూ కోట గారు ఫైర్ అయ్యారు: కెమెరామెన్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అప్పుడు ఆయన ఏందయ్యా సినీ ఇండస్ట్రీకి చిన్న పిల్లలు వచ్చి మార్కింగ్ వేసి రిస్ట్రిక్షన్‌ చేస్తున్నారని తనపై సీరియస్ అయ్యారని విందా చెప్పారు.దానికి తాను, సర్ పెద్ద పెద్ద నటులందరికీ కూడా అలాగే చేస్తున్నానని తాను ఇప్పటివరకు అలానే వర్క్ చేశానని చెప్పినట్టు విందా తెలిపారు.

ఆ సమయంలో ఆయన కొపగించుకున్నారు గానీ, ఫ్రెండ్లీగానే మాట్లాడారు అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

ఆ తర్వాత సర్ ఒకసారి ఈ రిహాల్సర్‌ను మానిటర్ చేయండి.

మీరు ఎక్కడ కావాలంటే అక్కడ నిలబడండి.దాన్ని బట్టి తాను మార్కింగ్‌ వేసుకుంటానని విందా కోట శ్రీనివాసరావుకు చెప్పినట్టు ఆయన తెలిపారు.

దానికి ఆయన పెద్ద వాళ్లతో అలా మాట్లాడొద్దని అన్నట్టు విందా అన్నారు.అయితే అది కేవలం ఒక రిఫరెన్సే కానీ, అలా అక్కడే ఆగాలనేది తన రూల్ కాదని తాను మళ్లీ ఆయనకు వివరించినట్టు విందా చెప్పారు.

Telugu Kota Srinivasa Rao, Pg Vinda, Sensational Comments, Tollywood-Movie

ఆలా గడిచిన రెండు రోజుల తర్వాత అందరం లంచ్‌ టైంలో ఉన్నపుడు, అపుడేదో సరదాగా మాట్లాడను.అలా ఏం అనుకోవద్దు.నీకు క్లారిటీ ఉంది.బాగా చేస్తున్నావు.సినిమా ఇండస్ట్రీలో ఇంకా ఎదుర్కోవల్సి వస్తుందని ఆయన తనను చాలా ఎంకరేజ్ చేసినట్టు విందా తెలిపారు.ఆ తర్వాత ఎడిటింగ్ అన్నీ అయిపోయాక, డబ్బింగ్ అప్పుడు వచ్చి తనను హగ్ చేసుకున్నట్టు ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

ఇంకా అప్పటినుంచి ఆయనంటే తనకు చాలా గౌరవం అని విందా చెప్పుకొచ్చారు.

#Pg Vinda

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube