సినిమాటిక్ స్టైల్ లో భారీ దోపిడీ... అంతా 20 నిమషాల్లోనే  

Cinematic Style Robbery In Ludhiana - Telugu Cinematic Style Robbery, Gold Loan Company, Ludhiana, Punjab

అప్పుడప్పుడు సినీ ఫక్కీలో దొంగతనం అనే మాట తరుచుగా వింటూ ఉంటాం.సినిమాలలో జరిగే దొంగతనం, రాబరీ తరహాలో సన్నివేశాలు రియల్ గా జరిగినపుడు అలా పోలుస్తూ ఉంటారు.

Cinematic Style Robbery In Ludhiana - Telugu Cinematic Style Robbery, Gold Loan Company, Ludhiana, Punjab-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే అదంతా సినిమాటిక్ రియల్ గా జరిగే అవకాశాలు ఉండవని చాలా మంది భావిస్తారు.అయితే రియల్ గా జరిగే సంఘటనలనే సినిమాలలో కాస్తా కల్పన జోడించి చూపిస్తారు.

ఇప్పుడు ఆ తరహాలో సినీమా స్టైల్ లో ఓ గోల్డ్ లోన్ సంస్థలో భారీ రాబరీ జరిగింది.ఈ ఘటన పంజాబ్ లోని లూధియానాలో జరిగింది.

ఇన్ఫోలైన్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ గోల్డ్‌ లోన్‌ సంస్థల్లోకి ఆయుధాలు పట్టుకుని ముసుగు ధరించిన కొంత మంది దొంగలు తుపాకీలతో సిబ్బందిని భెదిరించారు.తరువాత వారిని తాళ్లతో కట్టేసి లాకర్ తాళాలు తీసుకుని అందులో 30 కేజీల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు.

వీటి విలువ 12 కోట్లపైనే ఉంటుందని తెలుస్తుంది.సినిమా రేంజ్ జరిగిన ఈ దోపిడీ తతంగం అంతా కేవలం 20 నిమిషాల్లోనే జరిగిపోయింది.

దోపిడీ జరిగిన సమయంలో సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది.ఇక ఈ దొంగతనంకి సంబందించిన సీసీ కెమెరా రికార్డులని పోలీసులు పరిశీలించి దొంగల ఆచూకీ గుర్తించే పనిలో పడ్డారు.

తాజా వార్తలు

Cinematic Style Robbery In Ludhiana-gold Loan Company,ludhiana,punjab Related....