మొన్నటి వరకు ఏపీ గురించి పట్టించుకోని నటులు! కొత్తగా రాజకీయ విమర్శలు  

Cinema Stars On Political Campaign-

రాజకీయాలలో పార్టీలు మారగానే ఎలాంటి వారైనా శత్రువులుగా మారిపోతారు. రాజకీయ లక్ష్యాల కోసం అనవసరమైన విమర్శలతో బురద జల్లుకోవడానికి రెడీ అయిపోతారు. ఇక ఏపీ రాజకీయాలలో అయితే ఇది ఎప్పుడు జరిగేదే..

మొన్నటి వరకు ఏపీ గురించి పట్టించుకోని నటులు! కొత్తగా రాజకీయ విమర్శలు-Cinema Stars On Political Campaign

ఒకరి మీద విమర్శించడానికి సరైనా కారణాలు లేకపోతే వారి వ్యక్తిగత జీవితాన్ని కూడా రోడ్డు మీదకి లాగేస్తారు. పవన్ కళ్యాణ్ మీద కూడా ఆ తరహా దానినే విపక్ష పార్టీలు చేస్తున్నాయి. అవినీతి, మోసం వంటి ఆరోపణలు చేయలేని ప్రత్యర్ధులు నేరుగా పెళ్ళాలు, ప్యాకేజీ అంటూ కలరింగ్ ఇస్తున్నారు.

ఇదంతా ఒక ఎత్తయితే ఇప్పుడు ఏపీ రాజకీయాలలో ఎన్నడూ లేనంతగా సినిమా ఇండస్ట్రీ నటులు కూడా ఒక పార్టీ వైపు నిలబడి ప్రత్యర్ధి పార్టీపై ఎదురుదాడి చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీలోకి వెళ్ళిన నటులందరూ ఓ వైపు పవన్ కళ్యాణ్ ని మరో వైపిఉ చంద్రబాబుని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికల ముందు ఏపీకి ప్రత్యేక హోదా, విభజన అంశాల విషయంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు ఒక్కరు కూడా మీడియా ముందుకి వచ్చి మాట్లాడిన దాఖలాలు లేవు.

కనీసం ఏపీ ప్రజల తరుపున మాట్లాడిన సందర్భం కూడా లేదు.

ఇక ఎన్నికలు వచ్చే సరికి సినిమా ఇండస్ట్రీ నుంచి నటులు అందరూ ఉన్నపళంగా వారి వ్యక్తిగత లబ్ది కోసం వైసీపీ పార్టీలో చేరిపోయి పార్టీ సిద్ధాంతాల ప్రకారం జనసేనని లక్ష్యంగా చేసుకొని విమర్శిస్తూ ఉంటే, తన విద్యాసంస్థలని కాపాడుకోవడం కోసం మోహన్ బాబు వైసీపీలో చేరిపోయి చంద్రబాబుని టార్గెట్ గా చేసుకొని విమర్శలు చేస్తున్నారు. అయితే వీళ్ళంతా ఐదేళ్ళ కాలంలో ఎ ఒక్కరోజైనా ఏపీ గురించి మాట్లాడితే ప్రజలు వీరిని కొంతైనా విశ్వసించే వారు. అలా కాకుండా వ్యక్తిగత లాభాలు ఆశించి వచ్చి విమర్శలు చేయడంతో ప్రజలలో కూడా వారి పట్ల కొంత వ్యతిరేక భావం ఉంది అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.