కరోనా వల్ల రియల్ హీరోస్ అయినా రీల్ హీరోలు వీళ్లే!

చరిత్రలో మరిచిపోలేని సంవత్సరంగా 2020 ను ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకుంటారు.ఈ సంవత్సరంలో అతి భయంకరమైన కరోనా ప్రభావం ప్రతి ఒక్కరి పై పడింది.

 Cinema Celebrities Helping In Coronavirus Crisis, Corona Virus, Real Heros, Sonu-TeluguStop.com

కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించడంతో అన్ని రంగాలు మూతపడి ఎంతోమంది జీవనోపాధిని కోల్పోయారు.ఇలాంటి సమయంలో ఆపన్నహస్తం కోసం ఎదురుచూసే వారికి కొందరు వారికి తోచిన సహాయం చేసే వారిని ఆదుకున్నారు.

ఇందులో మన సినీ ఇండస్ట్రీ ప్రముఖులు రియల్ హీరోలుగా మారి తమ వంతు సహాయాన్ని చేశారు.అయితే ఆ హీరోల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

సోను సూద్

:

బాలీవుడ్ ప్రతినాయకుడు సోనుసూద్ సినిమాలలో మనకి విలన్ పాత్రలో కనిపిస్తారు.కానీ కరోనా సమయంలో ఎంతో మందికి తన వంతు సహాయం చేసి అందరి దృష్టిలో రియల్ హీరోగా మారిపోయాడు.

ఎంతోమంది వలస కూలీలు సుదూర ప్రాంతాలకు నడిచి వెళ్తున్న సమయంలో సోనూసూద్ వారిని ఆదుకొని ప్రత్యేక బస్సులు, రైలు, విమానాలలో సొంతగూటికి చేర్చి ఎంతోమంది మన్ననలను పొందాడు.

Telugu Akshsy Kumar, Corona, Heros, Sonu Sood, Tollywood, Tollywood Heros-Movie

అక్షయ్ కుమార్

:

వెండి తెరపై నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కరోనా సమయంలో తన వంతు సాయంగా భారీ విరాళాన్ని సీఎం సహాయ నిధికి ప్రకటించారు.ఒకేసారి 25 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచి తనదైన శైలిలో సహాయం చేశారు.

Telugu Akshsy Kumar, Corona, Heros, Sonu Sood, Tollywood, Tollywood Heros-Movie

టాలీవుడ్ అగ్రహీరోలు

:

కరోనా విజృంభిస్తున్న సమయంలో టాలీవుడ్ హీరోలు తమ వంతు సాయంగా విరాళాలను ప్రకటించి ఆదుకున్నారు.టాలీవుడ్ స్టార్ హీరో లైనా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ తదితరులు రెండు తెలుగు రాష్ట్రాలకు 50 లక్షలు చొప్పున విరాళాలను అందజేశారు.అలాగే ప్రభాస్ సీఎం సహాయ నిధికి 3 కోట్ల రూపాయలు, పవన్ కళ్యాణ్ కోటి రూపాయలను విరాళంగా ప్రకటించారు.అలాగే రామ్ చరణ్, ఎన్టీఆర్ రూ.75 లక్షల చొప్పున ప్రకటించారు.

అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ రెండు రాష్ట్రాల సీఎం సహాయనిధి లకు యాభై లక్షల చొప్పున ప్రకటించారు.అలాగే క్యాన్సర్ బాధితులకు 25 లక్షల చొప్పున మొత్తం 1.25 కోట్లు కరోనా సమయంలో విరాళంగా ప్రకటించారు.

Telugu Akshsy Kumar, Corona, Heros, Sonu Sood, Tollywood, Tollywood Heros-Movie

కరోనా కారణం వల్ల కుదేలైన చిత్ర పరిశ్రమలో పనిచేసే ఎంతోమంది ఆర్టిస్టులను ఆదుకోవడానికి “కరోనా క్రైసిస్‌” పేరిట ఏర్పాటు చేసిన చారిటీకి మెగాస్టార్ చిరంజీవి కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించారు అంతేకాకుండా యువ హీరోలందరూ తమ వంతు సహాయంగా విరాళాలను ప్రకటించి ఆపద సమయంలో ఎంతో మందిని ఆదుకున్నారని చెప్పవచ్చు.ఈ విధంగా కష్ట సమయంలో తమ వంతు సహాయంగా విరాళాలను ప్రకటించి అందరి దృష్టిలో కేవలం రీల్ హీరోలు మాత్రమే కాకుండా రియల్ హీరోలనే పేరును సంపాదించుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube