సినిమా బండితో తెలుగు ప్రేక్షకులని మెప్పించిన రాజ్ అండ్ డీకే

మనసు పెట్టి ప్రయత్నం చేస్తే తక్కువ బడ్జెట్ తో కూడా అద్బుతమైన కథని తెరపై ఆవిష్కరించి ప్రేక్షకులని మెప్పించవచ్చని ఈ మధ్యకాలంలో చాలా తెలుగు సినిమాలు ప్రూవ్ చేశాయి.వెంకటేష్ మహా దర్శకత్వంలో వచ్చిన కేరాఫ్ కంచరపాలెం మూవీని 50 లక్షల లోపు బడ్జెట్ తోనే పూర్తి చేశారు.

 Cinema Bandi Web Film Get Positive Response, Tollywood, Raj And Dk, Netflix, Dig-TeluguStop.com

అయితే సినిమాలో ఉండే ఎమోషన్ ప్రేక్షకులకి కనెక్ట్ కావడంతో అద్బుతమైన విజయాన్ని అందుకుంది.ఇలాంటి చిన్న సినిమాలు చాలా వరకు వచ్చి ఈ మధ్యకాలంలో ప్రేక్షకులని మెప్పిస్తున్నాయి.

చిన్న సినిమాలని కరెక్ట్ గా ప్రమోట్ చేస్తే వాటిలో బలమైన ఎమోషన్ ఆడియన్స్ ని థియేటర్ లో కూర్చోబెడుతుంది.అలాగే ఎలాంటి అంచనాలు లేకుండా సినిమా చూస్తారు కాబట్టి కథకి, అందులో పాత్రలకి భాగా కనెక్ట్ అవుతారు.

ఈ ఏడాది అలా చిన్న సినిమాగా వచ్చి అద్బుతమైన విజయాన్ని అందుకున్న మూవీ జాతి రత్నాలు.

తాజాగా బాలీవుడ్ దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే నిర్మించిన సినిమా బండి అనే మూవీ నెట్ ఫ్లిక్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

ప్రవీణ్ కాండ్రేగుల ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అయ్యాడు.ఈ సినిమాకి నెట్ ఫ్లిక్స్ లో మంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి.ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది.ఈ మధ్యకాలంలో నవ్వుతూనే ఎమోషన్స్ ని పండించి రియలిస్టిక్ డ్రామాని చూసామని నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ఉండటం విశేషం.

అందరూ కొత్తవాళ్లతో తెరకెక్కించిన ఈ సినిమాని థియేటర్ లో రిలీజ్ చేసిన మంచి హిట్ అయ్యేదనే మాట వినిపిస్తుంది.ఎక్కడా కూడా అతి లేకుండా చాలా సహజంగా ప్రతి ఒక్కరు మన ఊర్లలో మన చుట్టూ కనిపించే వ్యక్తుల తరహాలోనే నటించి మెప్పించారని ప్రశంసలు వస్తున్నాయి.

మొత్తానికి కరోనా కాలంగా ఒటీటీలో సినిమా బండి ప్రేక్షకులకి మంచి వినోదాన్ని అందించిందనే మాట వినిపిస్తుంది.బాలీవుడ్ లో సెటిల్ అయిన తెలుగు దర్శకులు రాజ్ అండ్ డీకే అద్బుతమైన టాలెంట్ ని టాలీవుడ్ కి పరిచయం చేసారనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube