తమిళనాడుని షేక్ చేస్తున్న జయరాజ్, ఫీనిక్స్ లాకప్ డెత్

దేశంలో లాక్ డౌన్ నేపధ్యంలో కొన్ని చోట్ల పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి.వాటికి సంబందించిన ప్రత్యక్ష సంఘటనలు కూడా కొన్ని రాష్ట్రాలలో జరుగుతున్నాయి.

 Cine Heroines Seeking Justice Over The Jayaraj And Fenix, Tollywood, Kollywood,-TeluguStop.com

అలాంటి సంఘటన ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో సంచలనంగా మారింది.ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే ప్రాణాలు అమాయకుల ప్రానాలని తీసారనే ఆందోళన వినిపిస్తుంది.

నిబంధనలకు విరుద్దంగా మొబైల్ షాపు తెరిచారనే కారణంతో పోలీసులు అరెస్ట్ చేసిన పి.జయరాజ, అతడి కొడుకు ఫెనిక్స్ మరణం ఇప్పుడు తమిళనాడులో సంచలనంగా మారడంతో ఆ సంఘటనకి కారణం అయిన పోలీసుల మీద యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ ప్రజల నుంచి వినిపిస్తుంది.

తండ్రి కొడుకులైన వీరిద్దరు జైలుకి వెళ్లి వచ్చిన తర్వాత విపరీతమైన గాయాలతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యి చనిపోయారు.

ఈ ఘటన తర్వాత రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఇదొక అమానవీయ సంఘటన అని సినీ సెలబ్రిటీల దగ్గర నుండి సామాన్య జనాల వరకు నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.వారికి న్యాయం చేయాలంటూ హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఉద్యమం నడుపుతున్నారు.

జూన్ 19న ట్యుటికోరిన్లో మొబైల్ షాపును పి.జయరాజ్ లాక్డౌన్ టైం కంటే 15 నిమిషాలు ఎక్కువసేపు తెరిచాడు.నిబంధనలను ఉల్లంఘించారనే కారణంతో జయరాజ్ను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు.తండ్రి జయరాజ్ అరెస్ట్ అయ్యాడని కొడుకు ఫెనిక్స్ స్టేషన్ కి వెళ్లి తండ్రి అరెస్ట్ గురించి ఆరా తీశాడు.

ఆ సమయంలో పోలీసులతో వాగ్వాదం జరగడంతో కొడుకు ఫెనిక్స్ ని కూడా అరెస్ట్ చేశారు.లాకప్ లో ఏం జరిగిందో తెలియదు గానీ తండ్రి కొడుకులు తరువాత మరణించారు.

ఈ ఘటనపై సినీ తారలు ముక్తకంఠంతో నిరసన తెలుపుతున్నారు.హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ స్పందించి ఆ వార్త విని గుండె బద్దలైంది.

తండ్రీకొడుకుల లాకప్డెత్ విషయం తీవ్రంగా కలచివేసింది.ఇలాంటి దారుణాన్ని చూస్తే మానవత్వం ఉందా అనిపిస్తుందని పోస్ట్ పెట్టింది.

జయరాజ్ ఫినిక్స్ కుటుంబాలకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నట్లు కోరింది.ఈ ఘటనపై కీయరా అద్వానీ, సింగర్ సుచిత్ర కూడా స్పందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube