సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన యాగంటి లో వెలిసిన శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం సన్నిధిలో సినిమా షూటింగ్ తీసేందుకు రావడం జరిగింది.ఈ మేరకు బాలకృష్ణ అభిమానులు యాగంటికి భారీ గా చేరుకున్నారు.
అనంతరం మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి యాగంటికి చేరుకొని బాలకృష్ణకు ఘన స్వాగతం పలికి కాసేపు ముచ్చటించడం జరిగింది.
ఈ నెల 20 నుండి 26 వ తేది వరకు ఆయన సినిమా షూటింగ్లో పాల్గొంటారు.20 న తెలంగాణా రాష్ట్రం అంలపూర్లో , 21 న యాగంటి , 22 ఓర్వకల్లు మండలం కొమ్మెచెరువు పరిసర ప్రాంతాలలో , 23 అదే మండలం పూడీచర్ల , 24 ఎయిర్పోర్టు , 25 కర్నూలు , 26 పంచలింగాలలో సినిమా షూటింగ్లో ఆయన పాల్గొంటారు .