పవన్ జాతకం ప్రకారం 2024కి రాజకీయాల్లో ఉండరు.. జనసేన పార్టీ అప్పటికి క్లోజ్: వేణుస్వామి

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చే 2024 ఎన్నికలలో గెలవడమే లక్ష్యంగా పెట్టుకొని తన పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.అయితే సొంత పార్టీని స్థాపించినప్పటికీ ఒంటరిగా పోటీ చేయకుండా టీడీపీ-బీజేపీ అలాంటి వివిధ పార్టీలతో పోటీ చేసి ఘోర పరాజయాన్ని చవిచూశాడు పవన్ కళ్యాణ్.

 Cine Astrologer Venu Swamy Predictions On Pawan Kalyan Janasena Party, Pawan Kal-TeluguStop.com

పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు.అంతేకాకుండా జన సేన గెలిచిన దాఖలాలు లేకుండా పోవడంతో 2024 ఎన్నికల్లో సీఎం కుర్చీ ఎక్కడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు పవన్.

కానీ పవన్ కళ్యాణ్ కు రాజకీయాలు అచ్చు రావు.త్వరలో జనసేన పార్టీ ఉండదు అంటూ జోస్యం చెప్పారు జ్యోతిష్యుడు వేణుస్వామి.

ఇప్పటికే వేణు స్వామి చెప్పిన మాటలు నిజం అయ్యాయి.సమంత నాగచైతన్య విడిపోతారని , చంద్రబాబు ఓడిపోతారని చెప్పారు.

అయితే తాజాగా పవన్ కళ్యాణ్ జాతకం ప్రకారం ఆయనకు రాజకీయ యోగం లేదని అంటున్నారు వేణు స్వామి.గత ఎన్నికల్లో కాదు వచ్చేఎన్నికలు ఆ తర్వాత రెండు దఫాలుగా వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు.

ఇందులో ఎటువంటి మార్పులు లేవు ప్రస్తుతం ఉన్న పార్టీల లీడర్లు వారి నక్షత్రాలను బట్టి చూస్తే రాబోయే 15 సంవత్సరాలు జగన్ సీఎంగా ఉండబోతున్నారని తెలిపారు .

Telugu Janasena, Pawan Kalyan, Tollywood, Venu Swamy-Movie

ఇక టీడీపీ, జనసేన పార్టీల పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తే.టీడీపీ గురించి పక్కన పెడితే జనసేన గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు.నేను చెప్తే వాళ్ళు నన్ను ఏదో చేస్తారని భయం లేదు.

నేను చనిపోవడానికి రెడీ.పవన్ కళ్యాణ్ ఒక మాటమీద నిలబడే వ్యక్తి కాదు.

ఆయన జాతకమే అంత.ఒకవైపు సినిమాలు అంటారు మరొకవైపు రాజకీయాలు అంటారు.ఎక్కడ ఒకదానిపై ఉండరు.పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉండరని నేను చెప్పడం కాదు ఆయన జాతకమే చెబుతోంది.2024 నాటికి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉండరు ఆయన లేనప్పుడు పార్టీ ఎక్కడ ఉంటుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు వేణు స్వామి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube