సమంత, నాగ చైతన్య విడిపోతారని మూడేళ్ళ క్రితమే చెప్పా.. వేణు స్వామి జోస్యం?

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ మారిన సమంత-చైతూల విడాకుల వ్యవహారం అందరికీ తెలిసిన విషయమే.తాజాగా సమంత అందుకు గానూ కొన్ని కోట్ల భరణం కూడా అందుకోబుతున్నారనే వార్తలు కూడా తెగ సంచారం చేస్తున్నాయి.

 Cine And Political Astrologer Venu Swamy About Samantha And Naga Chaitanya Divorce Issue-TeluguStop.com

పెళ్లి, విడాకులు అనేది వాళ్ల వ్యక్తిగత విషయమే అయినప్పటికీ, వాళ్లు చిత్ర సీమలో ఒక ఇమేజ్ సంపాదించుకున్న స్టార్స్.కాబట్టి ప్రజలకు తెలుసుకోవాలనే ఇంట్రస్ట్ కొద్దో, గొప్పో ఉండకు మానదు.

ఇక ఈ విషయంపై చై-సామ్ ఇద్దరూ కూడా మౌనంగానే ఉన్నారు.అక్కినేని ఫ్యామిలీ కూడా ఈ వ్యవహారంపై ఎలాంటి స్పందనను వ్యక్తపరచలేదు.కారణాలు ఏమైనప్పటికీ వారిద్దరూ త్వరలోనే విడిపోతారనే పుకార్లకు సోషల్ మీడియాలో వచ్చే వార్తలు బలాన్ని చేకూరుస్తున్నాయనే చెప్పాలి.

 Cine And Political Astrologer Venu Swamy About Samantha And Naga Chaitanya Divorce Issue-సమంత, నాగ చైతన్య విడిపోతారని మూడేళ్ళ క్రితమే చెప్పా.. వేణు స్వామి జోస్యం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉండగా.

తాజాగా ప్రముఖ సినీ, పొలిటికల్ అస్ట్రాలజర్ వేణు స్వామి .సమంత, నాగచైతన్య మధ్య విభేదాలు విడాకుల ఇష్యూపై స్పందించారు.తాను మూడేళ్ల క్రితమే వీళ్ల జాతకం చెప్పానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.నాగా చైతన్య, సమంత జాతకం తన దగ్గర ఉందని మూడేళ్ల క్రితమే వీళ్ల గురించి నాగరాజు ఇంటర్వ్యూలో చెప్పానని ఆయన అన్నారు.

ఇంతకీ సమంత నాగచైతన్య నిజంగానే విడిపోతున్నారా? అంటే గతంలో తాను ఏం చెప్పానో ఆ వీడియో చూడండని అంటున్నారు వేణు స్వామి.

ఇంతకీ నాలుగేళ్ల క్రితం (అప్పటికి సమంత నాగచైతన్యలకు పెళ్లి కాలేదు.రిలేషన్‌లో ఉన్నారు) ఈ వేణు స్వామి.సమంత-నాగ చైతన్యల గురించి ఏం చెప్పాడంటే నాకు అక్కినేని ఫ్యామిలీ అంటే కోపం ఏం లేదు గతంలో అక్కినేని అఖిల్‌‌కి ఎంగేజ్ మెంట్ అయినప్పుడు అది క్యాన్సల్ అవుతుందని చెప్పాను.ఆ టైంలో అది చాలా వెబ్ సైట్స్‌లలో రావడంతో నాగార్జున మీ మీద కేసు వేస్తారట అని అదీ ఇదీ అన్నారు.

కానీ కొన్నాళ్లకు నేను చెప్పినట్టుగానే అఖిల్ ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అయ్యింది.నేను జాతకాలను విశ్లేషించి ఏం జరుగుతుందో చెప్తాను.అఖిల్ గురించి కూడా అలాగే చెప్పాను.వివాహం జరగదు.

ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అవుతుందని చెప్పాను అలాగే అయ్యింది.

అలాగే నాగచైతన్య-సమంతల విషయంలోనూ వారి మ్యారేజ్ తరువాత సమస్యలు వస్తాయని ముందే చెప్పానని వేణు స్వామి అన్నారు.సమంత అమావాస్య నాడు పుట్టింది దాని వల్ల చైతూకి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయన్నది ముందే తాను విశ్లేషించి చెప్పానని ఆయన అన్నారు.సినిమాల పరంగా వాళ్లకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు.బాగా రాణిస్తారు.పెళ్లి చేసుకున్నా సమంత సినిమాల్లో కంటిన్యూ అవుతుంది అని వేణు స్వామి చెప్పారట.ఇటీవల సమంత-చైతూ విడిపోతున్నారనే వార్తలు రావడంతో నేను చెప్పానుగా అంటూ మరో సంచలన వ్యాఖ్యలతో వైరల్ అవుతున్నాడు ఈ వేణు స్వామి.

నిజంగా వేణు స్వామి చెప్పినట్టుగానే జరుగుతుందా ? లేదా అవన్నీ ఉత్తి మాటలేనా ? అవన్నీ పక్కన పెడితే.అసలు ఆ పుకార్లు నిజమా? కాదా? అనేది తెలియాలి.తెలియాలంటే వేచి చూడడం తప్ప మరో మార్గం లేదు.

#Samantha #Venu Swamy #Naga Chaitanya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు