పీకల్లోతు ప్రేమలో ఉన్నా పెళ్లికి దూరంగా ఉన్న సెలబ్రిటీలు వీళ్లే?

Cine Actress Is In Love But Not Getting Married Now

సినిమా రంగానికి చెందిన హీరోలు, హీరోయిన్లు తమకు క్రేజ్ ఎక్కువగా ఉన్న సమయంలోనే వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని భావిస్తారు.ఆ కారణం వల్లే ప్రేమలో ఉన్న పెళ్లి చేసుకోవడానికి చాలామంది హీరోలు, హీరోయిన్లు ఎక్కువగా ఆసక్తి చూపడం లేదు.

 Cine Actress Is In Love But Not Getting Married Now-TeluguStop.com

స్టార్ హీరోలతో పోలిస్తే హీరోయిన్ల లైఫ్ స్పాన్ తక్కువ కావడంతో కొంతమంది హీరోయిన్లు ఆఫర్లు తగ్గిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు.

మరి కొందరు హీరోయిన్లు మాత్రం సినిమాల్లో ఆఫర్లు తగ్గుతాయని పెళ్లికి దూరంగా ఉన్నరు.

 Cine Actress Is In Love But Not Getting Married Now-పీకల్లోతు ప్రేమలో ఉన్నా పెళ్లికి దూరంగా ఉన్న సెలబ్రిటీలు వీళ్లే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం పెళ్లి గురించి ఆలోచించే తీరిక తనకు లేదని కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.ఎప్పుడు పెళ్లి చేసుకోవాలని అనిపిస్తే అప్పుడే పెళ్లి చేసుకుంటానని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పుకొచ్చారు.

మరోవైపు వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ శృతిహాసన్ బిజీగా ఉన్నరనే సంగతి తెలిసిందే.

శంతనుతో ప్రేమలో ఉన్న శృతిహాసన్ ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ప్రేక్షకులకు శంతనుతో రిలేషన్ షిప్ గురించి క్లారిటీ ఇచ్చేశారు.

Telugu Alia Bhatt, Cine Actress, Married, Jackey Bhagnani, Nayantara, Shanthanu, Shruthi Hasan, Tapsee Pannu, Tollwood Love, Vignesh Shivan-Movie

అయితే పెళ్లి మాత్రం ఇప్పుడే చేసుకోనని శృతి చెబుతున్నారు.ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్, బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో సినిమాలతో శృతిహాసన్ బిజీగా ఉన్నరు.మరో స్టార్ హీరోయిన్ నయనతార విఘ్నేష్ శివన్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్నరు.

Telugu Alia Bhatt, Cine Actress, Married, Jackey Bhagnani, Nayantara, Shanthanu, Shruthi Hasan, Tapsee Pannu, Tollwood Love, Vignesh Shivan-Movie

కెరీర్ పరంగా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న నయనతార పెళ్లి ఎప్పుడు చేసుకుంటారనే ప్రశ్నకు సమాధానం చెప్పడం లేదు.మరో స్టార్ హీరోయిన్ తాప్సీ బ్యాడ్మింటన్ కోచ్ అయిన మథయాస్ బోతో రిలేషన్ లో ఉన్నరు.సంవత్సరానికి రెండు సినిమా ఛాన్సులు రాని పక్షంలో పెళ్లి గురించి ఆలోచిస్తానని ఆమె పేర్కొన్నారు.

మరో హీరోయిన్ అలియా భట్ సైతం రణబీర్ కపూర్ తో పెళ్లికి సంబంధించి ఎటువంటి క్లారిటీ ఇవ్వడం లేదు.

#Jackey Bhagnani #Nayantara #Vignesh Shivan #Shruthi Hasan #Actress

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube