ప్రముఖ నటుడి ఇంటికి సీల్ వేసిన అధికారులు.. అసలేం జరిగిందంటే?

Cine Actor Mansur Alikhan House Seez In Tamilanadu State

కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటులలో మన్సూర్ అలీఖాన్ ఒకరు.ప్రముఖ నటుడు వివేక్ గుండెపోటుతో మృతి చెందిన సమయంలో మన్సూర్ కరోనా వ్యాక్సిన్ గురించి చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అయ్యాయి.

 Cine Actor Mansur Alikhan House Seez In Tamilanadu State-TeluguStop.com

అయితే తాజాగా అధికారులు ఈ నటుడి ఇంటిని సీజ్ చేశారు.ప్రభుత్వ పోరంబోకు స్థలంలో మన్సూర్ అలీఖాన్ ఇంటిని నిర్మించుకోవడంతో కోర్టు ఉత్తర్వుల మేరకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

2500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న పోరంబోకు స్థలాన్ని మన్సూర్ అలీఖాన్ ఆక్రమించుకున్నారు.చూలైమేడు ప్రాంతంలో ఉన్న ఇంటిలో ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి మన్సూర్ అలీఖాన్ నివశిస్తున్నారు.

 Cine Actor Mansur Alikhan House Seez In Tamilanadu State-ప్రముఖ నటుడి ఇంటికి సీల్ వేసిన అధికారులు.. అసలేం జరిగిందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పోరంబోకు స్థలాన్ని మన్సూర్ ఆక్రమించుకోవడంతో గతంలోనే కొంతమంది అధికారులు అతనికి నోటీసులను జారీ చేశారు.అయితే మన్సూర్ అలీఖాన్ మాత్రం తనను మోసం చేసి కొంతమంది పోరంబోకు స్థలాన్ని విక్రయించారని చెబుతున్నారు.

Telugu Cine, Seez, Kollywood, Mansur Alikhan, Tamilanadu, Tolywood-Movie

2019 సంవత్సరంలో మన్సూర్ అలీఖాన్ కోర్టులో తనను మోసం చేసి ఆ స్థలాన్ని కొందరు అమ్మారని పిటిషన్ ను దాఖలు చేయగా కోర్టు ఆ పిటిషన్ ను కొట్టివేసింది.కార్పొరేషన్ అధికారులు గతంలో జారీ చేసిన నోటీసులను మన్సూర్ అలీఖాన్ పట్టించుకోలేదు.నోటీసులకు మన్సూర్ స్పందించకపోవడంతో అధికారులు కోర్టు మెట్లు ఎక్కగా కోర్టు ఉత్తర్వుల ప్రకారం అధికారులు తాళం వేసి సీల్ చేశారు.

అధికారులు ప్రముఖ నటుడి ఇంటికి సీల్ వేయడం కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలలో చర్చనీయాంశమైంది.కోలీవుడ్ లో ఈ ఘటన కలకలం సృష్టిస్తుండగా మన్సూర్ ఈ వివాదం గురించి మన్సూర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.మన్సూర్ ఇంటికి సీల్ వేయడంతో ఆయన అభిమానులు బాధ పడుతున్నారు.

మన్సూర్ మళ్లీ కోర్టు మెట్లు ఎక్కే అవకాశం అయితే ఉందని కొంతమంది అభిప్రాయపడుతుండటం గమనార్హం.కోలీవుడ్ నటుడి ఇంటికి సీల్ వేయడం ఆయనకు ఒక విధంగా అవమానమే అని చెప్పాలి.

#Kollywood #Seez #Tamilanadu #Mansur Alikhan #Tolywood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube