నితిన్ చెక్ మూవీకి అతిపెద్ద మైనస్ ఇదే..?

చంద్రశేఖర్ ఏలేటి డైరెక్షన్ లో నితిన్ హీరోగా తెరకెక్కిన చెక్ చిత్రం నిన్న విడుదలైన సంగతి తెలిసిందే.భీష్మ హిట్ తరువాత నితిన్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.

 Cilmax Is Biggest Minus For Nithin Check Movie-TeluguStop.com

సినిమా విడుదలకు ముందు క్లైమాక్స్ ఈ సినిమాకు హైలెట్ అవుతుందని కామెంట్లు వ్యక్తమయ్యాయి.అయితే నిన్న సినిమా విడుదలైన తరువాత క్లైమాక్స్ బాగానే ఉన్నా ఆ క్లైమాక్స్ సినిమాకు నెగిటివ్ గా మారిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

చెస్ లాంటి కథకు అలాంటి క్లైమాక్స్ సూట్ కాలేదని ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు.నితిన్ తన తెలివితేటలతో జైలు నుంచి నిర్దోషిగా నిరూపించుకుంచుకుని బయటకు వచ్చే విధంగా క్లైమాక్స్ ఉంటే బాగుండేదని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

 Cilmax Is Biggest Minus For Nithin Check Movie-నితిన్ చెక్ మూవీకి అతిపెద్ద మైనస్ ఇదే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.హీరోయిన్ రకుల్ పాత్రను కూడా దర్శకుడు సరిగ్గా తీర్చిదిద్దలేదు.

Telugu Chandrasekhar Yeleti, Climax, Minus Point, Nithin Check Movie, Priya Prakash Varrier, Rakul Pret Singh-Movie

లాయర్ పాత్రకు రకుల్ కు సూట్ అయినా సరైన సన్నివేశాలు ఉండి ఉంటే ఆ పాత్ర సినిమాకే హైలెట్ అయ్యేది.ప్రియా ప్రకాష్ వారియర్ నటించింది కొన్ని సన్నివేశాలే యాత్ర పాత్రలో మెప్పించింది.ఇప్పటివరకు చంద్రశేఖర్ ఏలేటి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో చాలా సినిమాలు కమర్షియల్ సక్సెస్ సంగతి పక్కన పెడితే కథ, స్క్రీన్ ప్లే విషయంలో ఎంతో మంచిపేరును సంపాదించుకున్నారు.

చెక్ మూవీలో మాత్రం ఏలేటి మార్క్ కనిపించలేదని ఆయన ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

చెక్ మూవీ తుది ఫలితం ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.నితిన్ హీరోగా నటించిన రంగ్ దే, పవర్ పేట సినిమాలు కూడా ఈ ఏడాదే విడుదల కానున్నాయి.

ఇకపై కథ, కథనం విషయంలో నితిన్ జాగ్రత్త వహిస్తే బాగుంటుందని ప్రేక్షకుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

#Minus Point #Climax #PriyaPrakash

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు