కరోనా అని తెలిసి కూడా,ఒకే సిగరెట్ షేర్ చేసుకున్న స్నేహితులు

దేశంలో కరోనా కోరలు చాపుతున్న విషయం తెలిసిందే.మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కరోనా విలయతాండవం చేస్తుంది.

 Three Persons Infected With Coronavirus After Cigarette Sharing In Shadnagar , S-TeluguStop.com

అలాంటి సమయంలో కరోనా కోరలు తెంచుకుంటున్నది అంది తెలిసి కూడా ముగ్గురు స్నేహితులు చేసిన నిర్వాకం తో ఆ ముగ్గురికి కూడా కరోనా పాజిటివ్ రావడం విశేషం.రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్న విషయం తెలిసిందే.

అయితే రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఒకరి నుంచి మరొకరికి రకరకాలుగా విస్తరిస్తోంది.

తాజాగా రంగారెడ్డి జిల్లాలో ఈ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది.

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన యువకుడు హైదరాబాద్ జియాగూడలో కరోనా వచ్చిన వారి అంత్యక్రియలకు వెళ్లొచ్చాడు.షాద్‌నగర్‌కు తిరిగొచ్చిన తర్వాత ఫ్రెండ్స్‌తో కలిసి సిగరెట్ తాగాడు.

ముగ్గురు స్నేహితులు ఒకే సిగరెట్‌ను షేర్ చేసుకోవడంతో విచిత్రమైన రీతిలో కరోనా లింకులు బయటపడ్డాయి.ఒక్క సిగరెట్‌తో స్నేహితులు ముగ్గురికి కూడా వైరస్ సోకింది.

కరోనా విస్తరణకు ఒక సిగరెట్ కారణమైందని తెలిసి అందరూ విస్తూ పోతున్నారు.

సోషల్ డిస్టెన్స్ పాటించాలి అని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి ఎంతగా ప్రభుత్వాలు మొరపెట్టుకుంటున్నా జనాలు మాత్రం లక్ష్య పెట్టకుండా ప్రవర్తిస్తున్నారు.

దీనితో వారు చేసే చిన్న చిన్న తప్పులతో ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు.ముగ్గురు స్నేహితులు ఒకే సిగరెట్‌ను షేర్ చేసుకోవడంతో .ముగ్గురికీ పాజిటివ్ వచ్చింది.దీంతో ముగ్గురినీ క్వారంటైన్‌కు తరలించారు.

మరోవైపు షాద్‌నగర్‌లో ఇప్పటికే కరోనా కేసులు ఏడుకు చేరుకున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube