సిగ‌రేట్ పీక‌ల‌తో స‌ముద్రం నిండుతోంది. ప్లీజ్ ఈ సారి అలా చేయ‌కండి బ్రో.!

నేటి త‌రుణంలో ప్లాస్టిక్ భూతం ప్రపంచాన్ని ఎలా భ‌య‌పెడుతుందో అంద‌రికీ తెలిసిందే.అనేక ప్ర‌దేశాల్లో మ‌నం ప‌డేస్తున్న ప్లాస్టిక్ వ‌ల్ల కాలుష్యం పెర‌గ‌డ‌మే కాదు, ప‌ర్యావ‌ర‌ణానికి కూడా హాని క‌లుగుతోంది.

 Cigarette Butts Are The Biggest Ocean Contaminan-TeluguStop.com

అయితే ప్లాస్టిక్ మాత్రమే కాదు, కాల్చి పారేసిన సిగ‌రెట్ పీక‌లు కూడా ఇప్పుడు కాలుష్య కార‌కాలుగా మారుతున్నాయి.దీంతోపాటు ప‌ర్యావ‌ర‌ణం కూడా దెబ్బ తింటోంది.

ముఖ్యంగా స‌ముద్రాల్లో ఇవి ప్లాస్టిక్ క‌న్నా ఎక్కువ‌గా చేరుతున్నాయ‌ట‌.దీని వ‌ల్ల కాలుష్యం మ‌రింత పెరుగుతుంద‌ని స‌ర్వేలు చెబుతున్నాయి.

సిగ‌రెట్ పీక‌ల వ‌ల్లే స‌ముద్రాల్లో కాలుష్యం ఎక్కువ‌గా ఏర్ప‌డుతుంద‌ని ఎన్‌బీసీ న్యూస్ చేసిన ప‌రిశీల‌న‌లో వెల్లడైంది.

గ‌డిచిన మూడు ద‌శాబ్దాల కాలంలో 60 మిలియ‌న్ల‌కు పైగా సిగ‌రెట్ పీక‌ల‌ను స‌ముద్రాల బీచ్‌ల నుంచి సేక‌రించిన‌ట్లు ఎన్‌బీసీ న్యూస్ తెలిపింది.సిగ‌రెట్ పీక‌లు కాకుండా బాటిల్ క్యాప్స్‌, రాప‌ర్స్‌, ప్లాస్టిక్ బాటిళ్లు, ఇత‌ర వ‌స్తువుల‌ను 1986 నుంచి బీచ్‌ల‌లో సేక‌రిస్తున్నారు.వీటిల్లో సిగరెట్ పీక‌లు 1/3 వ వంతు ఉన్నాయ‌ట‌.

సిగ‌రెట్ పీక‌ల్లో సెల్యులోజ్ అసిటేట్ అనే ఓ ర‌క‌మైన ప్లాస్టిక్ ఉంటుంది.ఇది స‌ముద్రాల్లో చేరిన‌ప్పుడు డీకంపోజ్ అవ‌డానికి 10 సంవ‌త్స‌రాల‌కు పైనే స‌మ‌యం ప‌డుతుంది.ఈ క్ర‌మంలోనే ప్ర‌తి ఏటా 5.6 ట్రిలియ‌న్ల సింథ‌టిక్ ఫిల్ట‌ర్లు (పీక‌లు) క‌లిగిన సిగ‌రెట్ల‌ను త‌యారు చేస్తుండ‌గా, వాటిల్లో 2/3 వంతు సిగ‌రెట్ పీక‌లు స‌ముద్రాల్లోకి, ఇత‌ర ప్ర‌దేశాల్లో వ్య‌ర్థాలుగా చేరుతున్నాయి.

కేవ‌లం సింథ‌టిక్ ఫిల్టర్లు మాత్ర‌మే కాకుండా సిగ‌రెట్ల‌లో నాన్ బ‌యోడీగ్రెడేబుల్ కెమిక‌ల్స్ కూడా ఎక్కువ‌గానే ఉంటాయి.ఇవి డీకంపోజ్ అయ్యేందుకు కొన్ని సంవ‌త్స‌రాల స‌మ‌యం ప‌డుతుంది.ఈ కార‌ణంగానే సిగ‌రెట్ పీక‌ల వ‌ల్ల ఇప్పుడు ఏటా కాలుష్యం పెరిగిపోతోంది.అయితే బ‌యో డీగ్రెడేబుల్ అయ్యే సిగ‌రెట్ ఫిల్ట‌ర్ల‌ను త‌యారు చేయాల‌ని గ‌తంలో ప‌లు కంపెనీలు ప‌రిశోధ‌న‌లు చేశాయి.

కానీ ఆ సిగ‌రెట్ ఫిల్ట‌ర్లు ఉండే సిగ‌రెట్లు మ‌న శ‌రీరానికి బాగా హాని చేస్తాయ‌ని తేల‌డంతో వాటిని ఉప‌యోగంలోకి తేలేదు.ఈ క్ర‌మంలో సిగ‌రెట్ పీక‌ల వ‌ల్ల క‌లుగుతున్న కాలుష్యానికి అడ్డుక‌ట్ట వేయ‌డం క‌ష్టంగా మారింది.

దీని ప‌ట్ల ప్ర‌భుత్వాలు చొర‌వ చూపితే త‌ప్ప ఈ స‌మస్య‌కు ప‌రిష్కారం దొర‌క‌డం నిజంగా క‌ష్ట‌మే.వెంట‌నే స్పందించ‌క‌పోతే సిగ‌రెట్ పీక‌ల వ‌ల్ల కాలుష్యం మ‌రింత పెరిగిపోయే ప్ర‌మాదం పొంచి ఉండ‌డంతోపాటు ప‌ర్యావ‌ర‌ణంపై కూడా అది తీవ్రంగా ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube