టీడీపీ నేత దేవినేని ఉమా కి Cid నోటీసులు...!!

తెలుగుదేశం పార్టీ నేత మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమా కి రాష్ట్ర సిఐడి నోటీసులు జారీ చేసింది.ఇటీవల ప్రెస్ మీట్ లో మార్ఫింగ్ చేసి ముఖ్యమంత్రి జగన్ వీడియోలను ప్రదర్శించారని కర్నూలు వైసీపీ నేత నారాయణ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు.

 టీడీపీ నేత దేవినేని ఉమా కి Cid న�-TeluguStop.com

వెంటనే కర్నూలు సి ఐ డి కార్యాలయానికి రావాలని.ప్రెస్ మీట్ లో ప్రదర్శించిన వీడియోని కూడా తీసుకు రావాలని దేవినేని ఉమా కు నోటీసులు జారీ చేశారు.

దీంతో ఈ విషయంపై స్పందించిన దేవినేని ఉమా వైసీపీ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు.తప్పుడు కేసులు పెడితే భయపడే ప్రసక్తి లేదని న్యాయపోరాటం చేస్తామని తెలిపారు.

అక్రమ కేసులు పెట్టి ఇళ్లకు గోడలకి నోటీసులు అంటిస్తే భయపడే వారు ఎవరూ లేరని అన్నారు.తప్పుడు రాజకీయాలు… తప్పుడు కేసులు అక్రమంగా జైల్లో పెడితే భయపడే పరిస్థితి లేదు అంటూ సీఎం జగన్ ని ఉద్దేశించి దేవినేని ఉమ కౌంటర్ కామెంట్లు చేశారు.

ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తే టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు మరింతగా పోరాటం చేయటం గ్యారెంటీ అని దేవినేని ఉమా సీరియస్ కామెంట్లు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube