సోషల్ మీడియాలో వైరల్ పోస్ట్ లు ! ఆరా తీస్తున్న సీఐడీ ? 

సోషల్ మీడియా అంటే ఒక సమాచార విప్లవం.గతంలో టీవీ చానళ్లు ,పత్రికల పైనే ఆధారపడి ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే వారు.

 Cid Inquiry Into Postings On Judges On Social Media Media, Social Media, Faceboo-TeluguStop.com

  సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా,  క్షణాల్లో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతోంది.చానళ్లు,  పత్రికలు తటస్థంగా వార్తలు ఇచ్చే రోజు ఎప్పుడో వెళ్ళిపోయాయి.

  కొన్ని పార్టీలకు కొన్ని ఛానళ్లు అన్నట్లుగా ఎవరి అనుకూల వాదనలు వారు వినిపిస్తున్నారు.కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత నాణానికి రెండు వైపులా ఏమో ఉందో తెలుసుకునేందుకు సాధ్యమైంది.

అందుకే ప్రతి ఒక్కరూ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుంటూ, ఒకరిని ఒకరు చైతన్యం చేసుకుంటూ వస్తున్నారు .అయితే ఈ సోషల్ మీడియాలో మంచి తో పాటు, చెడు అంత తొందరగా జనాల్లోకి వెళ్ళిపోతుంది.

సోషల్ మీడియా పై నియంత్రణ లేకపోవడంతో ఎవరి ఇష్టానుసారం వారు అసత్యాలను ప్రచారం చేస్తూ,  వాటిని నిజం చేసే ప్రయత్నం సోషల్ మీడియా ద్వారా చేస్తున్నారు.ఈ తరహ  వైరల్ పోస్టుల  ద్వారా ఎంతోమంది అంతర్గతంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారి విషయంలోనూ సోషల్ మీడియాలో ప్రచారం ఇదే విధంగా దుష్ప్రచారం అవుతుండడం చాలా కాలంగా జరుగుతూనే ఉంది.  ఇటీవల న్యాయమూర్తుల విషయంలోనూ సోషల్ మీడియా పోస్ట్ లు  మరీ వైరల్ కావడం తో సిఐడి ఈ తరహా పోస్ట్ లపై దృష్టి సారించింది.

 న్యాయమూర్తుల వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినే విధంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తరుణంలో గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇప్పుడు సిఐడి రంగంలోకి దిగినట్లు సమాచారం.ముఖ్యంగా గత వారం రోజులుగా న్యాయమూర్తుల విషయంలో వైరల్ అవుతున్న పోస్టింగ్స్ విషయంలో సిఐడి ప్రత్యేక దర్యాప్తు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube