ఎన్నికల వేల మాతృత్వం చాటిన మన సీఐ మేడం... ఎన్ని సెల్యూట్స్‌ కొట్టినా తక్కువే  

Ci Madhavi Caring Child In Polling Station Huzurabad-huzurabad,polling Station,women Ci Child Caring,తెలంగాణ రాష్ట్రం,హుజురాబాద్‌

సహజంగా పోలీసులు అంటే కఠువుగా ఉంటారు, కఠినంగా వ్యవహరిస్తారు, వారు చేసే పనులు కొన్ని సార్లు పోలీసు వ్యవస్థపైనే అసహ్యం కలిగించేలా ఉంటాయని చాలా మంది అంటూ ఉంటారు. సాప్ట్‌గా మాట్లాడితే వారిని ఎవరు పట్టించుకోరని, అందుకే తప్పకుండా వారు అలా రాష్‌గానే ఉండాలని మరి కొందరు అంటూ ఉంటారు. అయితే ఎప్పుడు ఎలా ఉండాలో పోలీసులు తెలుసుకుని ఉండాలని నేను అంటాను..

ఎన్నికల వేల మాతృత్వం చాటిన మన సీఐ మేడం... ఎన్ని సెల్యూట్స్‌ కొట్టినా తక్కువే-CI Madhavi Caring Child In Polling Station Huzurabad

అన్ని చోట్ల కూడా ర్యాష్‌గా ఉండకూడదు, అన్ని చోట్ల సాఫ్ట్‌గా ఉండకూడదు. పోలీసులు అంటే సీఐ మాధవి మేడంలా ఉండాలని నేను అంటాను.

తెలంగాణ రాష్ట్రం హుజురాబాద్‌ మండలంలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సీఐ మాధవి గారు భద్రత ఏర్పాట్ల పరిశీలన చేసేందుకు మండలంలోని తుమ్మనపల్లి గ్రామంకు వెళ్లింది. అక్కడ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి.

పలు గ్రామాల్లో పర్యటించి వచ్చిన మాధవి గారు తుమ్మనపల్లి గ్రామంలో కొద్ది నిమిషాలు కూర్చున్నారు. ఆ సమయంలోనే ఓటు వేసేందుకు ఒక మహిళ లైన్‌ లో నిల్చుని ఉంది. ఆ మహిళ చేతిలో చిన్న పాపాయి ఉంది..

చిన్న పాపాయిన ఎత్తుకుని ఆ మహిళ ఇబ్బంది పడుతుంది.

ఆ చిన్న పాప కూడా లైన్‌ లో ఉండటం వల్ల గాలి సరిగా రాక ఇబ్బంది పడుతుంది. దాంతో మాధవి గారు ఆ పాపాయిని తీసుకుని కొన్ని నిమిషాల పాటు లాలించింది. ఆ తల్లి ఓటు హక్కు వినియోగించుకుని వచ్చే వరకు ఆ పాపాయిని లాలిస్తూ వచ్చింది.

స్థానికంగా ఈ విషయం చర్చనీయాంశం అయ్యింది. ఒక సీఐ అయ్యి ఉండి అమ్మతనంను చాటుకున్న మాధవి గారిపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు. స్థానిక యువత ఆమె అమ్మతనంకు ఫిదా అయ్యి, ఆమెకు అభిమానులు అయ్యారు..