ఏపీలో డ్యూటీ చేస్తూ ఉండగా గుండెపోటుతో మరణించిన సీఐ..!!

CI Died Of Heart Attack While On Duty In AP , CI Died Of Heart Attack, Andhra Pradesh, CI Nageswara Rao

దేశవ్యాప్తంగా గుండెపోటు( heart attack ) మరణాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి.వయసుతో సంబంధం లేకుండా చాలామంది గుండెపోటుకు గురవుతున్నారు.

 Ci Died Of Heart Attack While On Duty In Ap , Ci Died Of Heart Attack, Andhra P-TeluguStop.com

ఒకప్పుడు పెద్ద వయసు కలిగిన వారు గుండెపోటుకు గురయ్యేవారు.కానీ ఇప్పుడు స్కూల్ మరియు కాలేజీ ఇంకా మధ్య వయసులో ఉన్నవారు కూడా గుండెపోటుకీ గురై చనిపోతున్నారు.

సామాన్యులు మొదలుకొని సినిమా సెలబ్రిటీల వరకు చాలామంది గుండెపోటుతో మరణిస్తున్నారు.జిమ్ చేస్తున్న వాళ్లు సైతం గుండెపోటుకు గురవుతున్నారు.

మహమ్మారి కరోనా ప్రభావం తగ్గిన తర్వాత దేశంలో మనిషి ఆరోగ్యంలో చాలా మార్పులు సంభవిస్తున్నాయి.ఈ క్రమంలో అత్యధికంగా గుండెపోటు రావటం చాలామందికి కలవరాన్ని పుట్టిస్తూ ఉంది.తాజాగా ఆంధ్ర ప్రదేశ్( Andhra Pradesh ) రాష్ట్రంలో డ్యూటీలో ఉన్న సీఐ గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచారు.పూర్తి వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా ఆత్మకూరు సీఐ నాగేశ్వరరావు(46)( CI Nageswara Rao ) గుండెపోటుతో మరణించడం జరిగింది.

డ్యూటీ చేస్తుండగానే గుండెపోటు రావడంతో వెంటనే హుటాహుటిన సిబ్బంది ఆయనని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

Video : CI Died Of Heart Attack While On Duty In AP CI Died Of Heart Attack, Andhra Pradesh #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube