నగ్న వీడియోలతో బెదిరిస్తున్న పాస్టర్.. దాంతో కరాటే కళ్యాణి....

ఈ మధ్య కాలంలో కొందరు పూజలు పురస్కారాలు పేరుతో మహిళలను లైంగికంగా వేధిస్తున్నారు. కాగా తాజాగా ప్రార్థన చేసేందుకుగాను వచ్చిన మహిళను లొంగదీసుకున్న పాస్టర్ తానూ చెప్పినట్లు వినకపోతే ఆమె నగ్న వీడియోలు బయటపెడతానంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్న ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.

 Church Pastor Blackmailing Devote In Rajahmundry-TeluguStop.com

పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా పరిసర ప్రాంతంలో ఓ యువతి తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటోంది. అయితే యువతి తరచుగా ప్రార్థనలు చేసేందుకుగాను తమ గ్రామం పరిధిలో ఉన్న ఓ చర్చికి వెళుతూ ఉండేది.

ఈ క్రమంలో ఇదే చర్చిలో పాస్టర్ గా పనిచేస్తున్న వ్యక్తితో పరిచయం ఏర్పడింది.దీంతో మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మించి పాస్టర్ ఏకంగా యువతిని శారీరకంగా లొంగ దీసుకున్నాడు.

 Church Pastor Blackmailing Devote In Rajahmundry-నగ్న వీడియోలతో బెదిరిస్తున్న పాస్టర్.. దాంతో కరాటే కళ్యాణి….-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఈ క్రమంలో  వీరిద్దరూ ఏకాంతంగా గడుపుతున్న సమయంలో యువతికి తెలియకుండా వీడియోలను కూడా తీశాడు.అనంతరం తాను చెప్పినట్లు వినకపోతే ఈ వీడియోను సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేస్తానంటూ బెదిరించ సాగాడు.

దీంతో యువతి తనని పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది.అయినప్పటికీ పాస్టర్ వినకుండా మరోమారు పెళ్లి పేరు ఎత్తితే ఈ వీడియోను ఇంటర్నెట్లో షేర్ చేస్తానని మళ్ళీ బెదిరించ సాగాడు.

దీంతో కుటుంబ సభ్యుల సహాయంతో యువతి రాజమండ్రి పోలీస్ స్టేషన్ లో పాస్టర్ పై ఫిర్యాదు నమోదు చేసింది. అంతేగాక తన బతుకును బుగ్గిపాలు చేసినటువంటి ఆ పాస్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను వేడుకుంది.

దీంతో తాజాగా ప్రముఖ టాలీవుడ్ నటి కరాటే కళ్యాణి యువతికి తన మద్దతు తెలియజేసింది.అంతేగాక మంచి చెడులు చెప్పి ప్రజలని మంచి మార్గంలో నడిపించాల్సిన  పాస్టర్ యువతిని శారీరకంగా వేధించడం సరికాదని కాబట్టి అతడిని అదుపులోకి తీసుకుని శిక్షపడేలా చూడాలని పోలీసులను కోరింది.

#ChurchPastor #Karate Kalyani #ChurchPastor #Rajahmundry

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు