గుంటూరు జిల్లాలో కలకలం రేపుతున్న ఎస్సై, కానిస్టేబుల్ ఆత్మహత్య ప్రయత్నం.. !

గుంటూరు జిల్లా చుండూరు పోలీస్ స్టేషన్‌లో కలకలం చోటు చేసుకుంది.ఈ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఒక మహిళ ఎస్సై, కానిస్టేబుల్ వీరిద్దరు కలిసి ఆత్మహత్యకు ప్రయత్నించడం తో ఈ ఘటన చోటు చేసుకుందట.

 Chundur Si Sravani And Constable Suicide Attempt In Guntur District-TeluguStop.com

ఆ వివరాలు చూస్తే.,/br>

గతేడాది అక్టోబరులో చుండూరు ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన శ్రావణి, ఇదే పోలీస్ స్టేషన్‌లో గత ఐదేళ్లుగా కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న రవీంద్ర పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారట.

 Chundur Si Sravani And Constable Suicide Attempt In Guntur District-గుంటూరు జిల్లాలో కలకలం రేపుతున్న ఎస్సై, కానిస్టేబుల్ ఆత్మహత్య ప్రయత్నం.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా ఆత్మహత్యాయత్నం తర్వాత వీరిద్దరూ స్వయంగా కారులో వెళ్లి తెనాలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరినట్టు సమాచారం.అయితే అక్కడి నుండి వారిని మరింత మెరుగైన చికిత్స కోసం గుంటూరులోని వేర్వేరు ఆసుపత్రులకు తరలించినట్టు పేర్కొన్నారు అధికారులు.

ఇకపోతే ఒకే చోట విధులు నిర్వహిస్తున్న వీరిద్దరిద్దరు చాలా సన్నిహితంగా మెలిగేవారని, ఈ క్రమంలో ఏదైన ఊహించని సంఘటన జరిగి ఉండవచ్చని, కానీ పూర్తి వివరాలు మాత్రం తెలియరాలేదని సీఐ రమేశ్‌బాబు తెలిపారు ప్రస్తుతం ఆత్మహత్యకు ప్రయత్నించిన వీరిద్దరు అపస్మారక స్థితిలో ఉన్నారని, స్పృహలోకి వచ్చిన తర్వాత పూర్తి వివరాలు సేకరిస్తామని ఈ సందర్భంగా సీఐ వివరించారు.

#Chundur SI #Suicide Attempt #Sravani #Guntur District #Constable

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు