క్రైస్తవ యువతుల టార్గెట్ గా లవ్ జిహాద్! బయటపెట్టిన సిరో మలబార్ చర్చ్

లవ్ జిహాద్.ఈ మధ్య కాలంలో ఇండియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు.

 Christian Girls Siro Malabar Church Jihad-TeluguStop.com

హిందూ యువతులని లక్ష్యంగా చేసుకొని ముస్లిం ఉగ్రవాద సానుబూతిపరులు ఉపయోగిస్తున్న థియరీ.ప్రేమ పేరుతో అమ్మాయిలని వలలో వేసుకొని వారి సహాయంతో ఇండియాలో ప్రవేశించడం, లేదంటే హిందూ అమమయిలని విదేశాలలో అమ్మేయడం చేస్తూ ఉంటారు.

ఇక ఇండియాలో ఐసీస్ ఉగ్రవాదులు ఇండియాలో ప్రవేశించి ఇక్కడ హిందుత్వం మీద దాడి చేయాలని అనుకుంటున్నారు.ఇదిలా ఉంటే ఇప్పుడు కేరళలో లవ్ జిహాద్ పేరుతో క్రైస్తవ యువతులని టార్గెట్ చేసుకొని హత్యలు చేస్తున్నారని సిరో మలబార్ చర్చ్ ఆరోపించింది.

కేరళలో లవ్ జిహాద్ విస్తరిస్తుందని ఆ పేరుతో అమాయక యువతుల ప్రాణాలు తీస్తున్నారని తెలియజేసింది.ఇది దేశ లౌకిక, సామాజిక, సామరస్యతను దెబ్బ తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

సిరో-మలబార్ చర్చ్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఈ విషయాలు తెలియజేశారు.ముఖ్యంగా కేరళలో ఐసీస్ సానుబూతిపరులు విస్తరిస్తున్నారని, ఇక్కడ క్రిస్టియన్ అమ్మాయిలని లక్ష్యంగా చేసుకొని వారిని ట్రాప్ చేస్తూ వారి రిపోర్ట్‌లో చర్చ్ తెలిపింది.

ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు.సిరో మలబార్ చర్చ్ గతంలోనూ ఇలాంటి ఆరోపణలు చేసింది.

లవ్ జిహాద్‌ను ఐసిస్ రాష్ట్రంలో విస్తరిస్తోందని గత సెప్టెంబర్‌లో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.అయితే నేషనల్ ఇంటలిజెన్స్ ఈ విషయంలో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని క్రిస్టియన్ సంఘాల వారు కోరుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube