క్రిస్ గేల్ దెబ్బకు రెండు ముక్కలైన బ్యాట్ ..!

క్రికెట్ అంటే చాలా మందికి ఇష్టం.క్రికెట్ లో ఎవరు బ్యాటింగ్ బాగా చేసినా కూడా వారికి ఫ్యాన్స్ ఫిదా అయిపోతారు.

 Chris Gayle Hits Two Pieces With A Bat-TeluguStop.com

ఇక వారిని దేవుడికన్నా ఎక్కువగా కొలుస్తుంటారు.బౌలింగ్ తో వికెట్లు పడగొట్టేవారికన్నా బ్యాటింగ్ తో పరుగుల వర్షం కురిపించేవారికే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు.

ఆ కోవకు చెందిన వాడే క్రిస్ గేల్.గ్రౌండ్ లోకి క్రిస్ గేల్ అడుగుపెట్టాడంటే చాలు పరుగుల వర్షం కురవాల్సిందే.

 Chris Gayle Hits Two Pieces With A Bat-క్రిస్ గేల్ దెబ్బకు రెండు ముక్కలైన బ్యాట్ ..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

క్రిస్ గేల్ క్రీజ్ లో కొన్ని నిమిషాలకే బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు.అందుకే క్రిస్ గేల్ పేరు తెలియనివారంటూ ఉండరు.

తాజాగా ఓ వీడియో క్రిస్ గేల్ నిజ స్వరూపానికి ప్రతీకగా నిలిచింది.గ్రిస్ గేల్ ఆడిన షాట్ కు ఆయన బ్యాట్ రెండు ముక్కలైపోయింది.

దీంతో అందరూ నోరెళ్లబెట్టాల్సి వచ్చింది.ప్రస్తుతం బ్యాట్ విరిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

విండీస్‌లో జరుగుతున్న సీపీఎల్‌ 2021లో క్రిస్‌ గేల్ సెంట్‌ కిట్స్‌ త‌రుపున బరిలోకి దిగాడు.అందులో గయానా అమెజాన్‌ వారియర్స్‌, సెంట్‌ కిట్స్‌ మధ్య సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ రసవత్తరంగా జరిగింది.

మ్యాచ్ లో అనుకోని ఘటన అందర్నీ ఆశ్యర్యపరిచింది.ఒక భారీ షాట్‌కి ప్రయత్నించిన క్రిస్‌గేల్ బ్యాట్‌ రెండు ముక్కలు అవ్వడంతో అంతా షాక్ తిన్నారు.

సెంట్‌ కిట్స్‌ ఇన్నింగ్స్‌ టైంలో చూస్తే ఇన్నింగ్స్‌ 4వ ఓవర్‌ను ఒడియన్ స్మిత్ వేయసాగాడు.ఓవర్‌ రెండో బంతిని స్మిత్ లెగ్‌స్టంప్‌ కు వేయగా గేల్‌ దానిని ఆఫ్‌సైడ్‌ ఆడాలని చూశాడు.అయితే బాల్ బ్యాట్‌కు బలంగా తగిలి రెండు ముక్కలయ్యింది బ్యాట్‌ కింద పడిపోయింది.హ్యాండిల్‌ మాత్రం రెండో ముక్కగా మారిపోయి గేల్‌ చేతిలోనే ఉండిపోయింది.ఆ తర్వాత గేల్‌ కొత్త బ్యాట్ తెప్పించుకొని తన ఆటను ఆడాల్సి వచ్చింది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

#Batsman #Chris Gale

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు