మహిళ ముందు గేల్‌ నగ్నంగా.. 3 యేళ్ల న్యాయ పోరాటం చేసి 2 లక్షల డాలర్లు పొందాడు     2018-12-04   10:06:18  IST  Sainath G

క్రిస్‌ గేల్‌ గురించి క్రికెట్‌ అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. క్రికెట్‌ గురించి కనీస అవగాహన ఉండి, క్రికెట్‌ను చూసే ప్రతి ఒక్కరికి కూడా క్రిస్‌ గేల్‌ సుపరిచితుడే. ఎందుకంటే ఆయన గెలుపొందినా, సెంచరీ సాధించినా కూడా చేసే డాన్స్‌ వరల్డ్‌ ఫేమస్‌. తన ఆనందాన్ని ఆపుకోలేక పిచ్చి పిచ్చిగా డాన్స్‌ వేసే గేల్‌ 2015వ సంవత్సరంలో వరల్డ్‌ కప్‌ సదర్బంగా ఒక మహిళతో ఆస్టేలియాలో అనుచితంగా ప్రవర్తించాడని, ఆమె ముందు అత్యుత్సాహంతో నగ్నంగా గేల్‌ నిలబడ్డాడు అంటూ ఒక ఆస్టేలియన్‌ మీడియా ప్రచురించింది. దాంతో అప్పటి నుండి కూడా గేల్‌పై విమర్శలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి.

Chris Gayle Awarded USD 221 000 In Defamation Case-New South Wales Supreme Court West Indies Cricket Star

క్రికెటర్‌గా ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నా, ఎంత మంచి రికార్డులు సొంతం చేసుకున్నా కూడా పేరు అలాగే ఉండి పోతుంది. 2016 జనవరి నుండి ఆ విషయమై ఆస్టేలియన్‌ కోర్టులో గేల్‌ న్యాయ పోరాటం చేస్తున్నాడు. తాజాగా ఆ కేసులో గేల్‌ గెలవడంతో పాటు 2.2 లక్షల డాలర్ల జరిమానాను సదరు మీడియా సంస్థ నుండి పొందనున్నాడు.

Chris Gayle Awarded USD 221 000 In Defamation Case-New South Wales Supreme Court West Indies Cricket Star

ఇంతకు ఆ మీడియా సంస్థ ప్రచురించిన కథనం ఏంటీ అంటే…. 2015లో ఆస్టేలియాలో జరిగిన ఐసీసీ సిరీస్‌లో వెస్టిండీస్‌ తరపున గేల్‌ ఆడాడు. ఆటగాళ్ల శారీరక ఫిట్‌ నెస్‌ కోసం మసాజ్‌ు చేయించుకుంటూ ఉంటారు. వెస్టిండీస్‌ ఆటగాళ్లు కూడా స్థానిక మసాజ్‌ సెంటర్ల నుండి మసాజ్‌ చేయించుకునేందుకు కొందరిని పిలిపించుకున్నారు. వారిలో కొందరు ఆడవారు కూడా ఉన్నారు. గేల్‌కు మసాజ్‌ చేసేందుకు ఒక లేడీ ఆయన వద్దకు వెళ్లింది. ఆ సమయంలో అతడు కేవలం టవల్‌ కట్టుకుని మాత్రమే ఉన్నాడు. ఆమె వచ్చిన సమయంలో కావాలని తన టవల్‌ విప్పి ఆమె ముందు నిబడ్డాడట. దాంతో ఆగ్రహించిన ఆ లేడీ అక్కడ నుండి వెళ్లి పోయిందట. ఇది గేల్‌ గురించి ఆ మీడియా సంస్థ రాసిన కథనం.

Chris Gayle Awarded USD 221 000 In Defamation Case-New South Wales Supreme Court West Indies Cricket Star

ఆ మీడియా సంస్థలో వచ్చిన కథనం ప్రపంచ వ్యాప్తంగా పాకింది. అన్ని మీడియాలు కూడా ఆ వార్తను కవర్‌ చేసి గేల్‌ పరువు తీశాయి. అప్పటి నుండి కూడా గేల్‌ కు ఆడవారు, లేడీ ఫ్యాన్స్‌ దూరంగా ఉంటూ వస్తున్నారట. ఎట్టకేలకు కోర్టులో తాను నిర్ధోషిని అంటూ గేల్‌ నిరూపించుకున్నాడు. సుదీర్ఘ వాదనలు విన్న కోర్టు సదరు మీడియా సంస్థ సరైన ఆధారాలు లేకుండానే గేల్‌పై ఆ కథనం రాసిందని, ఆ కథనం వల్ల గేల్‌ పరువు పోయిందని, అందుకు గాను 2.2 లక్షల డాలర్లను జరిమానాగా చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

న్యాయం జరగడంతో పాటు జరిమానా కూడా చెల్లించాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో క్రిస్‌ గేల్‌ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు. తన గురించి జనాలకు తెలియాలనుకుని న్యాయ పోరాటం చేశానని, తాను ఎటువంటి వాడినో అందరికి తెలియాలని, ఆడవారంటే తనకు గౌరవం అంటూ గేల్‌ పేర్కొన్నాడు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.