ముద్దు పెట్టుకుంటే ఆమెకు ఇబ్బంది లేదు.. మరి వీళ్లకు ఎందుకో?  

  • ‘కవచం’ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక సమయంలో కాజల్‌ను చోటాకే నాయుడు ముద్దు పెట్టుకున్న సంఘటన ప్రస్తుతం పెద్ద చర్చకు తెర తీసింది. తాగిన మత్తులో కాజల్‌కు చోటా ముద్దు పెట్టాడు అంటూ కొందరు ఆరోపిస్తూ ఉంటే మరి కొందరు మాత్రం చోటా కే నాయుడు మరీ హద్దు మీరి ప్రవర్తిస్తున్నాడు అంటూ విమర్శలు చేస్తున్నారు. చోటా కే నాయుడు ఇలా చేయడం ఇదే ప్రథమం కాదని, గతంలో కూడా హీరోయిన్స్‌ గురించి చెడుగా మాట్లాడటం, వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించడం చేశాడంటూ సోషల్‌ మీడియాలో అందుకు సంబంధించిన వీడియోలు మరియు ఇతరత్ర ఫొటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి.

  • Chota K Naidu Reacts About His Kiss With Kajal Agarwal-Chota Agarwal Kajal Kavacham Movie

    Chota K Naidu Reacts About His Kiss With Kajal Agarwal

  • తనపై వస్తున్న విమర్శలకు చోటా కే నాయుడు ఘాటుగా స్పందించాడు. ముద్దు పెట్టుకున్నందుకు ఇంత రచ్చ చేస్తున్నారేంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. నాకు సౌందర్య తర్వాత అంతగా కాజల్‌ అంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే ఆమెను ముద్దు పెట్టుకున్నాను. అందులో తప్పేం ఉంది అంటూ ప్రశ్నించాడు.

  • Chota K Naidu Reacts About His Kiss With Kajal Agarwal-Chota Agarwal Kajal Kavacham Movie
  • ముద్దు పెట్టుకున్న విషయంలో మీరు ఎందుకు ఇంతగా రచ్చ చేస్తున్నారో అర్థం కావడం లేదు అంటూ చోటా అన్నాడు. ఆమెపై నాకు అపారమైన అభిమానం ఉంది. ఆమెకు కూడా నేను అంటే గౌరవం. మా ఇద్దరి మద్య ఎలాంటి ఇబ్బంది లేని సమయంలో ఇతరులు ఎందుకు మరీ రచ్చ చేయాలని చూస్తున్నారో నాకు అర్థం కావడం లేదు అంటూ చోటా సన్నిహితుల వద్ద వాపోతున్నాడట.

  • Chota K Naidu Reacts About His Kiss With Kajal Agarwal-Chota Agarwal Kajal Kavacham Movie
  • అభిమానం, గౌరవం ఉన్నంత మాత్రాన పబ్లిక్‌ గా ముద్దు పెట్టుకోవడం పద్దతి కాదు అంటూ చోటా కే నాయుడుకు సినీ వర్గాల వారు మరియు జనాలు సూచిస్తున్నారు. గౌరవం ఉంటే కాళ్లు మొక్కించుకో, అభిమానం ఉంటే అది వేరే రకంగా చూపించుకోవాలి కాని ఇలా పబ్లిక్‌ గా ముద్దులు పెడితే ఏంటన్నట్లు అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి చోటా కే నాయుడు ను ఫల్‌ గా టార్గెట్‌ చేశారు.