కాజల్ ను స్టేజి మీదే ముద్దుపెట్టుకున్న చోటా కె నాయుడు ను నెటిజెన్స్ ఎలా తిడుతున్నారో చూడండి!  

‘కవచం’ టీజర్ రిలీజ్ ఈవెంటులో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఛోటా కె నాయుడు హీరోయిన్ కాజల్‌కు స్టేజీ మీద ముద్దు పెట్టి అందరూ షాకయ్యేలా చేశాడు. ఛోటా చేసిన పనికి కాజల్‌కు కోపం వచ్చినా ఏమీ చేయలేని పరిస్థితి. తమన్ రెచ్చగొట్టడం వల్లే తాను ఇలా చేశానని ఛోటా వివరణ ఇచ్చాడు. ఈ విషయాన్ని కాజల్ అగర్వాల్ లైట్ తీసుకున్నా…ఆమె అభిమానులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Chota K Naidu Kiss Kajal Aggarwal At Kavacham Teaser Launch-Kavacham Launch Kiss Net Zens Comments

Chota K Naidu Kiss Kajal Aggarwal At Kavacham Teaser Launch

ఛోటా కె నాయుడును టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. స్టేజీ మీద హీరోయిన్ అనుమతి లేకుండా ముద్దు పెట్టడం లాంటి చర్యలకు పాల్పడిన ఇలాంటి వారిని ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలంటూ ట్వీట్లు చేస్తున్నారు. ఇది కూడా మీ టూ కిందకే వస్తుంది అని కొందరు అంటున్నారు.

ఛోటా కె నాయుడు అనుమతి లేకుండా హీరోయిన్ కాజల్‌కు ముద్దు పెట్టడం వేధింపుల కిందకే వస్తుంది. ఈ విషయాన్ని చిన్మయికి చెప్పండి అంటూ…చిన్మయి భర్త రాహుల్ రవింద్రన్‌కు కొందరు సందేశాలు పంపారు. కొంతకాలంగా చిన్మయి లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా మీటూ ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే.


తెలుగు ఇండస్ట్రీ అప్ కమింగ్ హీరోయిన్లకు చాలా సేఫ్ అని అల్లు అర్జున్ చెప్పడం ఆనందంగా ఉంది. కానీ అంతలోనే ఛోటా కె నాయుడు అందరి ముందు హీరోయిన్‌కు ముద్దు పెట్టి ఇక్కడ సీనియర్ హీరోయిన్లకు కూడా భద్రత లేదు అనే విధంగా ప్రవర్థించాడంటూ మరికొందరు విమర్శలు చేశారు.

Chota K Naidu Kiss Kajal Aggarwal At Kavacham Teaser Launch-Kavacham Launch Kiss Net Zens Comments

#రిప్‌ ఛోటా‌ కె నాయుడు, #బ్యాన్ ఛోటా కె నాయుడు

#రిప్‌ ఛోటా‌ కె నాయుడు, #బ్యాన్ ఛాటా కె నాయుడు… అనే యాష్ ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్నాయి. పలువురు సినీ అభిమానులు, కాజల్ ఫ్యాన్స్ ఛోటా చేసిన పనిపై దుమ్మెత్తిపోస్తున్నారు.

అదే విధంగా యూట్యూబ్ లో కూడా కామెంట్స్ చేస్తున్నారు.