కొరియోగ్రాఫర్లను క్షమించమని కోరిన శేఖర్ మాస్టర్.. ఎందుకంటే..?  

choreographer sekhar master says sorry to dhee show choreographers Shekar, Dhee Show, Dance Program, Raju Dance, Ala Vaikuntapuram Lo, Choreographers, Dhee Show Judges - Telugu Ala Vaikuntapuram Lo, Choreographers, Dance Program, Dhee Show, Dhee Show Judges, Raju Dance, Sekhar Master Says Sorry To Dhee Show Choreographers, Shekar

టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్యాన్స్ మాస్టర్ గా తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శేఖర్ మాస్టర్.ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాల్లో వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు.

TeluguStop.com - Choreographer Sekhar Master Says Sorry To Dhee Show Choreographers

ఒకవైపు సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పని చేస్తూనే మరోవైపు ఢీ షోకు జడ్జిగా వ్యవహరిస్తూ శేఖర్ మాస్టర్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.టీవీ ఛానెళ్లలో ప్రసారమయ్యే ప్రత్యేకమైన ఈవెంట్లలో సైతం పాల్గొంటూ శేఖర్ మాస్టర్ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు.

అయితే ఢీ షోలో పాల్గొన్న శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్లకు క్షమాపణలు చెప్పారు.శేఖర్ మాస్టర్ ఏంటి.? క్షమాపణలు చెప్పడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా.? మాస్టర్ అలా చెప్పడానికి ప్రత్యేకమైన కారణమే ఉంది.బుధవారం రాత్రి ప్రసారమైన ఎపిసోడ్ లో కంటెస్టెంట్ రాజు అల వైకుంఠపురములో సినిమాలోని ఓ మై గాడ్ డాడీ పాట కు డ్యాన్స్ చేశారు.ఆ పాట మొదలయ్యే సమయంలో “ఇంట్లో తప్పులను తండ్రి సరిచేస్తాడని అదే విధంగా ఢీ షోలో మనం చేసే తప్పులను శేఖర్ మాస్టర్ సరి చేస్తాడు” అంటూ సాంగ్ స్టార్ట్ అయింది.

TeluguStop.com - కొరియోగ్రాఫర్లను క్షమించమని కోరిన శేఖర్ మాస్టర్.. ఎందుకంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఆ పాటకు రాజు అద్భుతంగా డ్యాన్స్ పర్ఫామెన్స్ చేయగా ఆ పర్ఫామెన్స్ అందరినీ ఆకట్టుకుంది.అనంతరం శేఖర్ మాస్టర్ స్టేజ్ పైకి వచ్చి మాట్లాడుతూ తన పోరాటం ఢీ స్టేజ్ పై ఒంటరిగా ప్రారంభమైందని.

తనతో పాటు అదే స్టేజ్ పై ఎంతోమంది ఉన్నారని.జడ్జిలుగా తాము కొరియోగ్రాఫర్లకు తప్పులు సరిదిద్దుకోవాలనే సూచనలు చేస్తామని.

ఎవరైనా జడ్జిమెంట్ వల్ల బాధ పడి ఉంటే క్షమించాలని అన్నారు.

శేఖర్ మాస్టర్ అలా చెప్పడంతో కంటెస్టెంట్లు, కొరియోగ్రాఫర్లు అవాక్కయ్యారు.

ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ శేఖర్ మాస్టర్ ప్రశంసలు అందుకుంటున్నారు.స్వయంకృషితో ఎంతో కష్టపడి గొప్పస్థాయికి చేరుకున్న శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా సినిమాసినిమాకు తన స్థాయిని పెంచుకుంటున్నారు.

#Shekar #Choreographers #Raju Dance #Dance Program #Dhee Show

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Choreographer Sekhar Master Says Sorry To Dhee Show Choreographers Related Telugu News,Photos/Pics,Images..