ఈ మధ్య కాలంలో కోరియోగ్రఫర్స్ దర్శకులు అవతారం ఎత్తుతున్నారు.ఇప్పటికే సౌత్ లో లారెన్స్ స్టార్ దర్శకుడుగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు.
అతని ప్రస్తానం కొరియోగ్రాఫర్ స్టేజి నుంచి స్టార్ట్ అయ్యింది.అలాగే ప్రభుదేవా బాలీవుడ్ లో దున్నేస్తున్నాడు.
అతను కూడా స్టార్ కొరియోగ్రాఫర్ అయిన తర్వాత తెలుగులో దర్శకుడుగా మొదలెట్టి బాలీవుడ్ లో సత్తా చాటుతున్నాడు.అలాగే వీరి దారిలో అమ్మ రాజశేఖర్ కూడా దర్శకుడుగా మారాడు.
అలాగే బాలీవుడ్ లో కూడా కొంత మంది కోరియోగ్రఫర్స్ దర్శకులుగా మారి సక్సెస్ లు అందుకున్నారు.ఇప్పుడు ఇదే దారిలో మరో కోరియోగ్రఫర్ కూడా వచ్చి చేరారు.
ప్రముఖ లేడీ కొరియోగ్రాఫర్ బృందా గోపాల్ దర్శకత్వంలో తన మొదటి సినిమాని మొదలెట్టారు.దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్, అదితీ రావ్ హైదరీ ప్రధాన పాత్రల్లో హే సినామిక టైటిల్ తో సినిమాని ప్రారంభించారు.
ఈ చిత్రానికి సంబంధించిన ఓపెనింగ్ చెన్నైలో ప్రారంభమైంది.తొలి షాట్‌కు మణిరత్నం, కె భాగ్యరాజ దర్శకత్వం వహించారు.ఈ సినిమాకి గోవింద్ వసంత సంగీతం అందిస్తున్నారు.ఇక తమిళంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.
రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.మరి కొరియోగ్రాఫర్ టూ దర్శకత్వం వచ్చిన బృందా మాస్టర్ ఎంత వరకు సక్సెస్ అందుకుంటుందో చూడాలి.