లోకో పైలట్,ప్రకృతి పిలిచింది అని ఆపుకోలేక ఆయన చేసిన పని!  

Chooses Natures Call Over Call Of Duty-

కొన్ని కొన్ని సార్లు ప్రకృతి ధర్మాలను మనం ఎంత వద్దు అనుకున్నా కానిచ్చేయాల్సిందే.కానీ మరి ఇంతలా కాకపోయినా సరైన ప్రదేశాలను వెతుక్కొని ఆ పనులను కానిచ్చేస్తూ కొంతమంది కెమెరాలకు చిక్కుతూ ఉంటారు.ఒకపక్క మోడీ సర్కార్ స్వచ్ఛ భారత్ అంటూ నినాదాలు చేస్తున్నప్పటికీ అటు ఉద్యోగులు గాని,రాజకీయ నేతలు కానీ తమ ప్రకృతి ధర్మాలనుఁ ఆపుకోలేక వీడియోలకు చిక్కుకుంటున్నారు...

Chooses Natures Call Over Call Of Duty--Chooses Natures Call Over Of Duty-

తాజాగా లోకో పైలట్ అలాంటి ప్రకృతి ధర్మాన్ని పాటిస్తూ ఒకరి కెమెరాకు చిక్కారు.ఇప్పుడు ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది.అతడు రైలు లోకోపైలట్ ముంబై లోకల్ ట్రైన్‌కు డ్రైవర్ఉ ల్లాస్‌నగర్ నుంచి ముంబై వైపు వెళ్లే రైలును నడుపుతున్న సమయంలో అతడికి సరిగ్గా ప్రకృతి నుంచి పిలుపువచ్చింది.

మరి ఏమనుకున్నాడో ఏమో గాని ఆపుకోలేక,లేక మరేదైనా రీజన్ కారణంగానో ట్రైన్ ను ఆపేసి మరీ ఇంజిన్ ముందుకు వెళ్లి తన పని తాను కానిచ్చేశాడు.అయితే ఎవరూ చూడరు అనుకున్న అతడు తన పని కానిస్తున్న సమయంలో ఎవరో ఆ దృశ్యాలను కెమెరాలో బంధించడం తో అతగాడు చేసిన పాడు పని బయటపడింది.ఆ దృశ్యాలను బంధించిన వారు అంతటితో ఊరుకోకుండా సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం తో ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది.

Chooses Natures Call Over Call Of Duty--Chooses Natures Call Over Of Duty-

ఇంకా ఈ విషయం రైల్వే అధికారులకు కూడా పాకడం తో విచారణకు ఆదేశించినట్లు తెలుస్తుంది.అయినా ప్రకృతి పిలుపులకు ఏదైనా వేరే స్థలం ఎంచుకోవాలి గాని ఇలా ఇంజిన్ ముందే పనికానిచ్చేసి ఇప్పుడు అధికారుల కు సంజాయిషీ ఇచ్చుకునే పరిస్థితి తీసుకొచ్చుకున్నాడు.ఏదైనా ప్రజలు ఇలా చేయొద్దు అలా చేయొద్దు అని చెప్పాలిన రైల్వే అధికారులే ఈ విధంగా పబ్లిక్ గా ఇంజిన్ ముందే పని కానిచ్చేస్తే సామాన్య ప్రజానీకానికి ఇంక ఎలాంటి నీతులు చెప్పగలుగుతారు.