కొవ్వును కరిగించే ఆహారం  

Cholesterol Reducing Foods-

మనం ఏమి తినాలన్నా ముందుగా మనస్సులో తలెత్తే ప్రశ్న ఏమిటంటే….ఈ ఆహారం తీసుకుంటే కొవ్వు పెరుగుతుందా? అయితే ప్రతి ఆహారంలోని కొవ్వు ఉండదు.కొన్ని ఆహారాలు అయితే కొవ్వును కరిగిస్తాయి కూడా.ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.తాజా కూరగాయలు,పండ్లలో ఉండే పొటాషియం కొవ్వును కరిగించటంలో కీలకమైన పాత్రను పోషిస్తాయి.వీటిని తిన్నప్పుడు నిదానంగా జీర్ణం అయ్యి శక్తి నిదానంగా విడుదల అవుతుంది.దాంతో కొవ్వు నిల్వలు శరీరంలో పేరుకోవు.మొక్కజొన్న పేలాలు కొవ్వును అదుపులో ఉంచటానికి సహాయపడతాయి.వీటిలో యాంటీ ఆక్సిడెంట్, పీచు సమృద్ధిగా ఉంటాయి.కాకపోతే మొక్కజొన్న పేలాలులో వెన్న కలపకుండా కొంచెం ఉప్పు కపిపి మాత్రమే తీసుకోవాలి.

Cholesterol Reducing Foods---

గ్లైసమిక్ స్థాయిలు తక్కువగా ఉండే ముడి బియ్యంలో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి.అంతేకాక వాటిలో ఉండే పీచు,సెలీనియం ఆకలిని అదుపులో ఉంచుతాయి.దాంతో కొలస్ట్రాల్,బిపి అదుపులో ఉండటమే కాక కొవ్వు నిల్వలు కూడా పెరగవు.కొవ్వు అధికంగా ఉండే పాల మీగడను ఉపయోగించాల్సిన వంటకాల్లో కమ్మని పెరుగును వాడితే పోషకాలు శరీరానికి సమృద్ధిగా అందుతాయి.

కొవ్వు సమస్య అసలు ఉండదు.