చాక్లెట్ దేవుడు... నైవేద్యంగా చాక్లెట్లు అంటేనే ఆ దేవుడికి ఇష్టమట.. మరి ఎక్కడో తెలుసా...?!

మామూలుగా ఏ దేవుని కైనా సరే పంచభక్ష పరమాన్నాలు లేకపోతే మరి కొంత మంది దేవుళ్ళకు జంతుబలి లాంటి వాటిని నైవేద్యంగా పెడుతుంటారు.ఇక అసలు విషయంలోకి వస్తే చాక్లెట్లు అంటే ఇష్టపడని వారు చాలా తక్కువ ఉంటారు.

 Kerala Temple God Loves Munch Chocolate, Chocolate God, Chocolate, Offering, Ker-TeluguStop.com

మరి ముఖ్యంగా చిన్న పిల్లలు అయితే అన్నం తినకుండా సరే కేవలం చాక్లెట్స్ తో అలా గడిపేస్తారు.ఇలా మన వరకు చాక్లెట్లు ఓకే గాని, మరి కొత్తగా ఓ దేవుడికి చాక్లెట్లు అంటే ఇష్టం ఉంటే మనం ఏం చేస్తాం…? ఆ చాక్లెట్ సమర్పించి దేవుడా అని ప్రార్థించాల్సిందే.అవును మీరు విన్నది నిజమే.ఆ దేవుడికి కేవలం చాక్లెట్ అంటే ఇష్టమట.చాక్లెట్లు తప్ప ఇంకేవీ ఇష్టం ఉండవని అక్కడి పూజారులు తెలియజేస్తున్నారు.అంతేకాదు చాక్లెట్లను సమర్పించిన భక్తులకు ఆయన కోరికలు తీరుస్తాడు అన్నట్లు అక్కడి అర్చకులు తెలియజేస్తున్నారు.

అసలు ఇలాంటి దేవుడు ఉన్నాడా.? ఉంటే ఎక్కడ ఉన్నాడు.? ఇలాంటి వివరాలను పూర్తిగా ఓసారి చూద్దామా…

కేరళ రాష్ట్రంలోని అలెప్పి ప్రాంతంలో ఉండే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఈ వింత ఆచారం కొనసాగుతోంది.ఆ గుడిలో ప్రతిష్టించిన సుబ్రహ్మణ్య స్వామికి ఈ చాక్లెట్లు అంటే చాలా ఇష్టమట.

ఇక్కడ సుబ్రహ్మణ్యస్వామిని మురుగన్ స్వామి అని కూడా పిలుస్తుంటారు.భక్తులు ఆ గుడికి ఎటువంటి పూలు, కొబ్బరి కాయలు, అగర్బత్తీలు , పండ్లు తీసుకువెళ్లారు.

ఒకవేళ అలవాటులో పొరపాటు గా అక్కడికి తీసుకు వెళ్ళిన లోనికి అనుమతించారు.అక్కడికి వెళ్లాలంటే కేవలం ఆ దేవుడికి మంచ్ చాక్లెట్ మాత్రమే తీసుకువెళ్లి నైవేద్యంగా సమర్పించాలి.

అక్కడ సుబ్రహ్మణ్యస్వామికి మంచ్ చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం అంట.అందుకని అక్కడ ఉన్న భక్తులు ఆ చాక్లెట్స్ ను తెగ కొనుగోలు చేస్తుంటారు.

అయితే వినడానికే వెరైటీగా ఉన్నా…ఈ ఆచారం గురించి అక్కడ స్థానికులను అడగగా వారు ఒక కథను చెబుతున్నారు.అదేమిటంటే ఆ ప్రాంతంలో ఓ ముస్లిం బాలుడు గుడికి వెళ్లి రాగ ఆ పిల్లాడి తల్లిదండ్రులు గుడికి ఎందుకు వెళ్ళావని తిట్టారని, ఆ తర్వాత కొన్ని రోజులకు ఆ పిల్లాడు అనారోగ్యానికి గురవ్వగా దాంతో తమ కొడుకును కాపాడాలంటూ సుబ్రహ్మణ్యస్వామికి ఆ పిల్లాడి తల్లిదండ్రులు మొక్కుకున్నారట.

అలా మొక్కుకున్న తర్వాత పిల్లాడి ఆరోగ్యం కుదుట పడిన తర్వాత వెంటనే ఆ పిల్లాడిని తీసుకుని ఆ దేవుడికి దగ్గరకి తీసుకు వెళ్లారట.ఇక ఆ సమయంలో ఉన్న గుడిలోని పూజారి పిల్లాడి ఆరోగ్యం నయం అయింది కదా మరి మురుగన్ స్వామికి ఏమిస్తావు అని అడగ్గా ఆ పిల్లాడు అమాయకంగా తన దగ్గర ఉన్న చాక్లెట్ ఇచ్చాడట.

ఇక అంతే అప్పటి నుంచి ఆ గుడికి చాక్లెట్ గుడి అని పేరు పొందింది.ఆ ఊరిలోని గుడి నిర్మించి ఇప్పటికి మూడు వందల ఏళ్లు గడుస్తున్నా… గత ఆరు సంవత్సరాల నుంచి మాత్రమే ఈ వింత ఆచారం కొనసాగుతోంది.

అప్పటినుంచి ఆ స్వామికి చాక్లెట్ అంటే ఇష్టమని భక్తులందరూ చాక్లెట్లు కొని తెచ్చి వారి వారి కోరికలను స్వామికి విన్నవించుకున్నారు.ఇలా స్వామివారికి చాక్లెట్లు సమర్పించి కోరికలు కోరుకుంటే వెంటనే తీరుతాయని భక్తుల నమ్మకం.

ఆ నమ్మకం కాస్తా అలా పెరిగి పెరిగి ప్రస్తుతం అక్కడ అది ఒక సాంప్రదాయం గా మారిపోయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube