ఈ దశాబ్దంలో మోస్ట్ ఫెయిల్యూర్ హీరోగా మారిపోయిన చియాన్ విక్రమ్  

Chiyaan Vikram Have One More Disaster With Mister K K -

చియాన్ విక్రమ్ అంటే సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.కమల్ హసన్ తర్వాత విలక్షణ నటుడుగా సౌత్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు విక్రమ్.

Chiyaan Vikram Have One More Disaster With Mister K K

కెరియర్ ఆరంభంలో కొన్ని తెలుగు సినిమాలు చేసిన విక్రమ్ తర్వాత స్వామి సినిమా తర్వాత కోలీవుడ్ లో వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస హిట్స్ తో స్టార్ హీరో రేంజ్ కి దూసుకోచ్చేసాడు.అతని సినిమా వచ్చింది అంటే అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది అనేంతలా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ప్రతి సినిమాలో తన విలక్షణ పాత్రలతో ప్రేక్షకులని ఆకట్టుకునే విక్రమ్ కథల ఎంపికలో మాత్రం ఫెయిల్ అవుతున్నాడు.

ఈ దశాబ్దంలో మోస్ట్ ఫెయిల్యూర్ హీరోగా మారిపోయిన చియాన్ విక్రమ్-Movie-Telugu Tollywood Photo Image

ఈ నేపధ్యంలో గత పదేళ్ళ కాలంలో విక్రమ్ పదికి పైగా సినిమాలలో నటించాడు.

ప్రతి సినిమాలో నటుడుగా ఒక మెట్టు ఎక్కుతూనే ఉన్నాడు అయితే హీరోగా మాత్రం ఫెయిల్ అయిపోతున్నాడు.అన్ని సినిమాలు డిజాస్టర్ టాక్ తో నిర్మాతలకి భారీగా నష్టాలు తెచ్చిపెడుతున్నాయి.

అయిన కూడా శంకర్ లాంటి దర్శకుడు సైతం విక్రమ్ తో సినిమాలు తీయడానికి ముందుకి వస్తున్నాడు.అలాగే బడా నిర్మాతలు ఇతని సినిమా మీద పెట్టుబడి పెడుతున్నారు.

ఏది ఏమైనా హిట్ మాత్రం వరించడం లేదు.తాజాగా విక్రమ్ కొత్త సినిమా మిస్టర్ కేకే తో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.

ఈ సినిమా ట్రైలర్ చూసి ఈసారి అతను సక్సెస్ వస్తుందని భావించిన విక్రమ్ గత సినిమాల తరహాలోనే మేకింగ్, టేకింగ్ తప్ప కంటెంట్ లేదని రిలీజ్ తర్వాత అర్ధమైపోయింది.దీంతో తెలుగులో ఈ సినిమా రిలీజ్ అయ్యింది అనే విషయం కూడా జనం మరిచిపోయారు.

ఇక తమిళంలో కూడా అంతంత మాత్రంగానే ఆడుతుంది.మరి ఇలాంటి టైంలో విక్రమ్ కి సాలిడ్ హిట్ ఎవరు ఇస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు