వాళ్ల ప్రేమకు ఫిదా అయిన నటి, ఎమ్మెల్యే రోజా.. ఏం జరిగిందంటే?

ఈ మధ్య కాలంలో సినిమా తారలు రాజకీయాల్లో పోటీ చేస్తున్నా విజయం సాధించడం లేదు.అయితే ప్రముఖ నటి రోజా మాత్రం వైసీపీ నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు.

 Chittor Fans Suprises Nagari Mla Roja With Flowers-TeluguStop.com

రాజకీయాల్లో బిజీ అయిన తర్వాత రోజా సినిమాలకు దూరమైనా టీవీ షోలతో మాత్రం బిజీగా ఉన్నారు.జబర్దస్త్ షోకు గడిచిన 8 సంవత్సరాలుగా ఆమె జడ్జిగా వ్యవహరిస్తుండటం గమనార్హం.

మరోవైపు నగరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ రోజా వార్తల్లో నిలుస్తున్నారు.అయితే నగరి నియోజకవర్గంలోని రోజా అభిమానులు ఆమెను ఫిదా అయ్యేలా చేశారు.రోజా పూలు వేసి తల్లలకొద్దీ పూలు జల్లి రోజాపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.నగరి నియోజకవర్గంలో ఉన్న తట్నేరి అనే గ్రామంలో ప్రజలు ఈ విధంగా రోజాపై ఉన్న అభిమానంను చాటుకున్నారు.

 Chittor Fans Suprises Nagari Mla Roja With Flowers-వాళ్ల ప్రేమకు ఫిదా అయిన నటి, ఎమ్మెల్యే రోజా.. ఏం జరిగిందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Chittore Fans, Jabardasth Judge, Jabardasth Show, Movies, Nagari Mla Roja, Nagari People, Roja Grand Welcome, Roja With Flowers, Tatneri Village, Ycp-Movie

కొన్ని నెలల క్రితం రోజా బోరుబావి ప్రారంభోత్సవం కోసం హాజరు కాగా ఆ సమయంలో కూడా అభిమానులు ఇదే విధంగా అభిమానాన్ని చాటుకున్నారు.సినిమా సన్నివేశాన్ని తలపించే విధంగా రోజాపై ఆమె అభిమానులు పూలు వేయడం గమనార్హం.ఎమ్మెల్యే రోజా తనకు ఓట్లు వేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరిస్తున్నారు.

Telugu Chittore Fans, Jabardasth Judge, Jabardasth Show, Movies, Nagari Mla Roja, Nagari People, Roja Grand Welcome, Roja With Flowers, Tatneri Village, Ycp-Movie

ఒక విధంగా ప్రజల్లో తనకు మంచి గుర్తింపు రావడానికి జబర్దస్త్ కారణమని భావిస్తున్న రోజా ఎంత బిజీగా ఉన్నా ఈ షోలో మాత్రం జడ్జిగా పాల్గొంటున్నారు.గతంలో కొంతమంది రోజా జబర్దస్త్ షోలో పాల్గొనడంపై విమర్శలు చేసినా రోజా మాత్రం ఆ షోకు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు.ఇతర షోలలో ఆఫర్లు వస్తున్నా రోజా ఆ ఆఫర్లను సున్నితంగా రిజెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

రోజా కూతురు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

#Tatneri #Nagari MLA Roja #Chittore Fans #Nagari #Roja Grand

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు