చంద్రబాబు కి “చుక్కలు” చూపిస్తున్న “గల్లా ఫ్యామిలీ”       2018-06-02   01:01:25  IST  Bhanu C

గల్లా ఫ్యామిలీ ఏపీ రాజకీయాల్లో పెద్దగా పరిచయం చేయనక్కర్లేని పేరు..కాంగ్రెస్ హయాంలో చిత్తూరు జిల్లాలో చక్రం తిప్పిన గల్లా ఫ్యామిలీ ఇప్పుడు చిత్తూరు లో క్రమ క్రమగా పట్టుకోల్పోతోంది ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ విభజనకి అనుకూలంగా నిర్ణయం తీసుకుందో అప్పుడే ఆ సమయంలో ఉన్న నాయకులు సైతం మట్టి కొట్టుకుపోయారు అయితే వారు వేరే పార్టీలలోకి వెళ్ళినా సరే వారిపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత అలానే ఉండి పోయింది అయితే గల్లా అరుణ కి మాత్రం తన నియోజకవర్గంలో వ్యతిరేకత ఉన్నా సరే తన క్యాడర్ విషయంలో మాత్రం ఎక్కడా పట్టు కోల్పోలేదు అయితే తాజాగా గల్లా అరుణ చంద్రబాబు వద్ద డిమాండ్ ల మీద డిమాండ్ లు పెడుతూ బాబు గారికి చుక్కలు చూపిస్తోందట…ఇంతకీ చంద్రబాబు వద్ద గల్లా ఫ్యామిలీ ఉంచిన డిమాండ్ ల వివరాలలోకి వెళ్తే..

‘గల్లా’ కుటుంబం చిత్తూరు జిల్లాలో రాజకీయాలలో పోటీ చేయడానికి సిద్దంగా లేరట తాము చిత్తూరు నుంచీ పోటీ చేసే ప్రశక్తి లేదని తేల్చి చెప్పేశారట…ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబును కలసి కోరిన విషయం తెలిసిందే. చంద్రగిరి నుంచి మూడుసార్లు గెలిచి కాంగ్రెస్‌ హయాంలో మంత్రిగా పనిచేసిన ‘గల్లా అరుణ’ ఇప్పుడు…అక్కడ పోటీ చేయనని చెప్పడం వెనుక మామూలు ప్లాన్ లేదని భారీ ప్లాన్‌ ఉందని కొందరు టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు ఇంతకీ ఏమిటా ప్లాన్ అంటే

గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచీ టీడీపి లోకి వచ్చిన గల్లా ఫ్యామిలీ కి టీడీపీ లో మంచి ప్రాధాన్యత ఇచ్చారు చంద్రబాబు అయితే అరుణకి చంద్రగిరి ,అరుణ కొడుకు జయదేవ్ కి గుంటూరు ఎంపీ గా పోటీ చేసే అవకాశం ఇవ్వగా జయదేవ్ గెలవగా అరుణ ఓడిపోయారు దాంతో అనూహ్యంగా అరుణ చుట్టూ రాజకీయాలు పెరిగిపోవడంతో ఆమె తాజాగా చంద్రగిరి నుంచి తప్పుకుంటున్నానని చెప్పారు…అయితే ఈ విషయంలో చంద్రబాబు ఎంతో సైలెంట్ గా ఉన్నారు తప్ప వద్దని వారించని పరిస్థితి లేక పోవడంతో ఆమె ఒకింత నోచ్చుకున్నారు కూడా అయితే

ఇప్పుడు గుంటూరు ఎంపీగా గల్లా జయదేవ్ ఎంపిక దాదాపు ఖరారు అయ్యింది మరి గల్లా ఫ్యామిలీ కి ఇవ్వవలసిన అసెంబ్లీ టిక్కెట్టు విషయంలో చిత్తూరు నుంచీ కాకుండా గుంటూరు నుంచీ కావాలని అది కూడా మంగళగిరి టిక్కెట్‌ తమకు ఇస్తే..తమ కుటుంబం నుంచి ఎవరో ఒకరు పోటీ చేస్తారని..ఆ కుటుంబం ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఒత్తిడి తెస్తోందట..అంతేకాదు రాజధానిలో కీలకమైన ‘మంగళగిరి’ టిక్కెట్‌ తమ కుటుంబానికి ఇస్తే..తాము సులువుగా విజయం సాధిస్తామని వారు డిమాండ్ చేస్తున్నారట..అయితే గల్లా ఫ్యామిలీ చేస్తున్న డిమాండ్ తో చంద్రబాబు షాక్ తిన్నారట.

అయితే గల్లా ఫ్యామిలీ నుంచీ ఎలాగో అరుణ రాజకీయాల నుంచీ తప్పుకోవడంతో ఆమె కుమార్తె కి ఈ అవకాశం కల్పించాలని ఒత్తిడి తెస్తున్నారట.. అయితే ఈ విషయంలో ఎక్కడ చంద్రబాబు వెనకడుగు వేస్తారోనని ముందుగానే మాకు ఇచ్చిన మాట ప్రకారం ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే అవకాశం ఇచ్చేయండి అది కూడా గుంటూరు జిల్లాలోనే కావాలి అని పట్టు పడుతున్నారట. అయితే ఒకే జిల్లా నుంచీ చంద్రబాబు గల్లా ఫ్యామిలీ కి టిక్కెట్లు ఇస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది అంటున్నారు టీడీపి నేతలు