బ్యాచిలర్ నుండి 'చిట్టి అడుగా' పాట.. చివరి సాంగ్ ఇదే..!

అక్కినేని అఖిల్ ప్రస్తుతం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ సినిమా పూర్తి చేసి విడుదలకు సిద్ధంగా ఉంచాడు.రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్నారు.తాజాగా ఈ సినిమా నుండి చివరి పాటను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.”చిట్టి అడుగా” అనే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసారు మేకర్స్.ఈ సాంగ్ కూడా అభిమానులను అలరిస్తుంది.

 Chitti Adugu Lyrical Song Released From Most Eligible Bachelor, Chitti Adugu Lyr-TeluguStop.com

ఈ పాటకు సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు.ఈ సినిమా మరొక నాలుగు రోజుల్లో విడుదల అవుతున్న నేపథ్యంలో వరుస అప్డేట్ లు ఇస్తూ ఈ సినిమాను ప్రజలకు చేరువ చేసేందుకు మేకర్స్ కృషి చేస్తున్నారు.ఈ ప్రమోషన్స్ లో భాగంగానే ఇప్పుడు ఆఖరి పాటను విడుదల చేసారు.

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయినా పాటలు, టీజర్, ట్రైలర్ అన్ని కూడా ఈ సినిమాపై అంచనాలను పెంచేసాయి.

ముఖ్యంగా లెహరాయి పాట అయితే యూత్ కు బాగా కనెక్ట్ అయ్యింది.

ఇక ఈ సినిమాలో అఖిల్ బుట్టబొమ్మ పూజా హెగ్డే తో రొమాన్స్ చేయబోతున్నాడు.అందుకే ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.

ముందు నుండి కూడా అఖిల్, పూజా రొమాన్స్ ఈ సినిమాలో అదిరిపోతోందని మేకర్స్ చెప్పడంతో అభిమానులు కూడా వీరి పెయిర్ తెర మీద ఎలా ఉంటుందో చూడాలని ఆతృతగా ఉన్నారు.

ఈ సినిమా అక్టోబర్ 15న దసరా కానుకగా విడుదల కాబోతుంది.అఖిల్ తన కెరీర్ లో ఇప్పటి వరకు ఒక్క మంచి హిట్ కూడా కొట్టలేదు.ఇక ఎలాగైనా ఈ సినిమాతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకోవాలని అఖిల్ ఉవ్వులూరుతున్నాడు.

ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.

మరి చూడాలి ఈ సినిమా ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుంటుందో.

https://youtu.be/qD8sPWTekDQ

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube