ఎప్పుడో 20 ఏళ్ల క్రితం చిత్రం సినిమా టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.ఆ సినిమాతో తేజ దర్శకుడుగా టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు.
టీనేజ్ లవ్ స్టొరీని అప్పటి కాలానికి తగ్గట్లు తెరకెక్కించి యువతకి భాగా కనెక్ట్ అయ్యేలా చేశాడు.దీంతో సినిమా సూపర్ హిట్ అయ్యింది.
చిన్న సినిమాగా తక్కువ బడ్జెట్ తో, అందరూ కొత్తవాళ్లతో తెరకెక్కిన ఆ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని రికార్డ్ కలెక్షన్స్ కూడా రాబట్టింది.ఆ సినిమాతో టాలీవుడ్ కి ఒక స్టార్ దర్శకుడు, కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్ పరిచయం అయ్యారు.
ఇప్పుడు ఆ ముగ్గురు ఎవరి దారిలో వారు ఉన్నారు.ప్రస్తుతం తేజ చిన్న సినిమాలు పక్కన పెట్టి స్టార్స్ తో చేసుకుంటున్నారు.
ఆర్పీ పట్నాయక్ పమ్యూజిక్ డైరెక్టర్ గా పెద్దగా సినిమాలు చేయడం లేదు.కెమెరామెన్ సమీర్ రెడ్డి మాత్రం తన హవా కొనసాగిస్తున్నాడు.
అయితే ఎన్నేళ్ళ తర్వాత మరల చిత్రం సీక్వెల్ కోసం ఈ ముగ్గురు కలవబోతున్నారు.
తేజ పుట్టినరోజు సందర్భంగా చిత్రం 1.1 టైటిల్ తో సినిమాని ఎనౌన్స్ చేశారు.రెండు దశాబ్దాల క్రితం చిత్రంతో టాలీవుడ్ కి పరిచయం అయిన టెక్నికల్ టీం మొత్తం ఈ సీక్వెల్ కోసం పని చేయబోతున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాతో ఏకంగా 52 మంది కొత్త నటీనటులని ఇప్పటికే ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.పూర్తిగా కొత్త క్యాస్టింగ్ తోనే ఈ సినిమా రూపొందుతుంది.
ఇక ఈ కథని ప్రెజెంట్ ట్రెండ్ ని దృష్టిలో ఉంచుకొని టీనేజ్ లవ్, డేటింగ్, స్మార్ట్ ప్రపంచంలో సోషల్ మీడియా ప్రభావాన్ని తేజ తెరపై ఆవిష్కరించబోతున్నట్లు తెలుస్తుంది.కంప్లీట్ ట్రెండీ కథనంతో ఈ సీక్వెల్ ప్లాన్ చేసిన తేజ త్వరలో సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళబోతున్నారు.